Top News

Police Special Drive | బాన్సువాడలో పోలీసుల స్పెషల్ డ్రైవ్

బాన్సువాడలో పోలీసుల స్పెషల్ డ్రైవ్  

నంబర్ ప్లేట్ లేని వాహనాల సీజ్ – హెల్మెట్ తప్పనిసరి

తెలంగాణ డైలీ న్యూస్,  బాన్సువాడ: రోడ్డు భద్రత నిబంధనల అమలులో భాగంగా బాన్సువాడ పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. నంబర్ ప్లేట్ లేని, ట్యాంపర్ చేసిన వాహనాలను గుర్తించి సీజ్ చేశారు. 

సి.ఐ. తుల శ్రీధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ డ్రైవ్‌లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులను తనిఖీ చేశారు. ఎక్కువ చలాన్లు పెండింగ్‌లో ఉన్న వారితో చలాన్లు కట్టించారు. 

ఈ సందర్భంగా సి.ఐ. తుల శ్రీధర్ మాట్లాడుతూ, బయటకు వెళ్లేటప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. నంబర్ ప్లేట్ లేని వారు వెంటనే నంబర్ ప్లేట్ ఏర్పాటు చేసుకోవాలని, లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. 

వాహనాలు నడిపే సమయంలో వాహనానికి సంబంధించిన అన్ని పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ తప్పనిసరిగా వెంట ఉంచుకోవాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని ఆయన తెలిపారు.

ఈ స్పెషల్ డ్రైవ్‌లో ఎస్.ఐ.లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రానున్న రోజుల్లో కూడా ఇలాంటి తనిఖీలు కొనసాగుతాయని పోలీసులు తెలిపారు.

1 Comments

Post a Comment

Previous Post Next Post