బాన్సువాడలో ప్రైమ్ ఫార్మసీ గ్రాండ్ ఓపెనింగ్ !
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం
అందుబాటులో నాణ్యమైన మెడిసిన్స్
బాన్సువాడ: పట్టణ ప్రజలకు మెరుగైన వైద్య, ఆరోగ్య సేవలు అందించే లక్ష్యంతో నూతనంగా ఏర్పాటు చేసిన ప్రైమ్ ఫార్మసీ బుధవారం గ్రాండ్ గా ప్రారంభమైంది.
బాన్సువాడ ఎమ్మెల్యే, టి.జి. ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాస్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ఫార్మసీని ప్రారంభించారు. ఈ కార్యక్రమం బాన్సువాడ ప్రభుత్వ మాతృ శిశు ఆసుపత్రి సమీపంలో ఉదయం 11 గంటలకు జరిగింది.
ఈ కార్యక్రమంలో టి.జి. స్టేట్ అగ్రోస్ ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజు, మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ కాసుల విజయ బాలరాజు, మున్సిపల్ వైస్ చైర్మన్ ఎండి. రేష్మా ఎజాజ్, ప్యాక్స్ చైర్మన్ వై. కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ జి. గంగాధర్, ఏరియా ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎం. శ్రీనివాస్, బాన్సువాడ డీఎస్పీ బి. విఠల్ రెడ్డి,ఎస్‌హెచ్‌వో టి. శ్రీధర్, ఏఐఎంఐఎం టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ ఖాన్, మాజీ వైస్ చైర్మన్ షేక్ జుబేర్, వార్డు కౌన్సిలర్ అబ్దుల్ ఖలీక్, టి.జి. కెమిస్ట్ అండ్ డ్రగ్స్ అసోసియేషన్ జిల్లా ట్రెజరర్ చిదుర శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
ఫార్మసీ ప్రత్యేకతలు
"Care, Cure and Compassion - Trusted by hearts, committed to your health" అనే నినాదంతో ప్రారంభమైన ఈ ఫార్మసీలో అన్ని రకాల మందులు, వైద్య పరికరాలు, బ్యూటీ ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయి. ఆధునిక సౌకర్యాలతో, నాణ్యమైన సేవలతో ప్రజలకు అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేశారు.
ఫార్మసీ యజమానులు ఎండి. ముఫక్కమ్ అహ్మద్, ఎండి. మొయిన్ ఉద్దీన్ మాట్లాడుతూ, ప్రజల ఆరోగ్యమే తమ ప్రథమ ప్రాధాన్యత అని, నాణ్యమైన మందులను సరసమైన ధరలకు అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు ప్రైమ్ ఫార్మసీని సందర్శించి, యజమానులను అభినందించారు. ఈ కార్యక్రమానికి గురు వినయ్ కుమార్ స్వామి, ఎండి. అహ్తేశామ్ అహ్మద్, అబ్దుల్ వహాబ్ సాహబ్ తదితరులు శుభాకాంక్షలు తెలిపారు.


إرسال تعليق