Top News

BJP | సూపరింటెండెంట్‌కు బిజెపి నాయకుల వినతి

ఆసుపత్రిలో మెరుగైన సేవలు అందించాలి  

సూపరింటెండెంట్‌కు బిజెపి నాయకుల వినతి

బాన్సువాడ :బాన్సువాడలోని ఏరియా ఆసుపత్రి, మాతా శిశు ఆసుపత్రిలో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని బిజెపి నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్, డి.సి.హెచ్.ఎస్ శ్రీనివాస్‌ను కోరారు.

మంగళవారం నాడు బిజెపి రాష్ట్ర నాయకుడు పైడిమల్ లక్ష్మీనారాయణ, కొనాల గంగారెడ్డి  ఆధ్వర్యంలో కొత్తగా నియమించిన ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీనివాస్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలోని సిబ్బంది పనితీరుపై చర్చించారు. అలాగే రోగులకు అందుతున్న సేవలు, మందుల సరఫరా గురించి ఆరా తీశారు. 

ఆసుపత్రికి ప్రతిరోజు వందలాది మంది రోగులు వస్తున్నందున మెరుగైన వైద్య సేవలు అందించాలని, సిబ్బంది కొరతను తొలగించాలని బిజెపి నాయకులు విజ్ఞప్తి చేశారు.




బాన్సువాడ నల్ల పోచమ్మ ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవాలు  

బిజెపి నాయకులు పాల్గొని బోనం సమర్పణ

ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా బాన్సువాడ పట్టణంలోని నల్ల పోచమ్మ ఆలయంలో మంగళవారం ఘనంగా బోనాల ఉత్సవాలు జరిగాయి.

ఆరే కటిక సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఉత్సవాల్లో బిజెపి రాష్ట్ర నేత పైడిమల్ లక్ష్మి నారాయణ, కొనాల గంగారెడ్డి, గుడుగుట్ల శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. వారు స్వయంగా బోనం ఎత్తుకుని అమ్మవారికి బోనం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ ఉత్సవాల్లో పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, అమ్మవారి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.

Post a Comment

أحدث أقدم