వ్యాస మహర్షి యోగా సొసైటీలో ఘనంగా గోరింటాకు మహోత్సవం
సిద్ధిపేట,(తెలంగాణ డైలీ న్యూస్) ఆగస్టు 07 :
సిద్ధిపేటలోని వ్యాస మహర్షి యోగా సొసైటీ మరియు మహిళా జాగరణ సమితి సంయుక్త ఆధ్వర్యంలో గురువారం రాత్రి నిర్వహించిన గోరింటాకు మహోత్సవం మహిళల సందడి, సంప్రదాయ వస్త్రధారణ, గోరింటాకు అలంకరణలు, కోలాటాలతో కనుల పండువగా జరిగింది.
ఈ సందర్భంగా మహిళా జాగరణ సమితి అధ్యక్షురాలు లక్కిరెడ్డి విజయ శుభకర్ రెడ్డి మాట్లాడుతూ, భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించడం ప్రతి మహిళ బాధ్యత అని అన్నారు. ఆషాఢ మాసంలో గోరింటాకు ధరించడం ఆరోగ్యపరంగా, ఆధ్యాత్మికంగా విశిష్టమైన సంప్రదాయమని పేర్కొన్నారు. ఇటువంటి కార్యక్రమాలు మహిళల్లో ఐక్యతను పెంపొందించి, కుటుంబ విలువలను బలోపేతం చేస్తాయని తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ మహిళా విభాగం ఉపాధ్యక్షురాలు మంకాల నాగరాణి మాట్లాడుతూ, నేటి తరానికి భారతీయ ఆచారాలు, సంప్రదాయాలను పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. గోరింటాకు మహోత్సవం వంటి కార్యక్రమాలు మహిళల్లో ఆత్మీయతను, సామాజిక బంధాలను పెంపొందించడంతో పాటు మన సంస్కృతిని భావితరాలకు అందించే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.
బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర కార్యదర్శి ఉమా రెడ్డి ఈ. మాట్లాడుతూ, మహిళలు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే యోగా మరియు భారతీయ సంస్కృతి రెండూ సమానంగా అవసరమని అన్నారు. వ్యాస మహర్షి యోగా సొసైటీ నిర్వహిస్తున్న ఆరోగ్య, సాంస్కృతిక కార్యక్రమాలు సమాజానికి ఎంతో ఉపయోగపడుతున్నాయని అభినందించారు.
అనంతరం యోగా శిక్షకురాలు తోట సంధ్య సతీష్ మాట్లాడుతూ, గోరింటాకు మహోత్సవం మహిళల ఉత్సాహభరిత పాల్గొనికతో కనుల పండువగా సాగిందన్నారు. యోగా ద్వారా ఆరోగ్యాన్ని పెంపొందించుకోవడంతో పాటు భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడే కార్యక్రమాలను కూడా వ్యాస మహర్షి యోగా సొసైటీ నిరంతరం నిర్వహిస్తుందని తెలిపారు.గోరింటాకు పూజ, కోలాటాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో మహిళలు అలరించారు.
ఈ కార్యక్రమంలో వ్యాస మహర్షి యోగా సొసైటీ సభ్యులు విజయలక్ష్మి, చందన, వాసవి, మంజుల, శ్రీదేవి, మౌనిక, అర్చన, గౌరి, లావణ్య, లత తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق