ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ వేగవంతం చేయాలి: వీడియో కాన్ఫరెన్స్ లో సీఈఓ సుదర్శన్ రెడ్డి
జిల్లాలో 1,84,742 నోటీసులు జనరేట్ : కలెక్టర్ ప్రతిమా సింగ్
కామారెడ్డి, ఆగస్టు 29: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి ఆదేశించారు.
శనివారం హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లా కలెక్టర్లు, ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో సమీక్ష నిర్వహించారు. నోటీసుల పంపిణీ వేగవంతం చేయాలని, జారీ చేసిన 7 రోజుల తర్వాత విచారణ చేపట్టాలని, అనామలీస్ జాబితాను రాజకీయ పార్టీల ఏజెంట్లకు అందుబాటులో ఉంచాలని సూచించారు. క్లెయిమ్స్, అభ్యంతరాల స్థితిని రోజూ నోటీసు బోర్డుపై నవీకరించాలని, పారదర్శకంగా గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు.l
కామారెడ్డి జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో 1,84,742 నోటీసులు జనరేట్ చేయగా 36,664 నోటీసులు జారీ చేశామని, 2102 నోటీసుల హియరింగ్ పూర్తి చేసి పరిష్కార చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, తహసీల్దార్ హిమబిందు తదితరులు పాల్గొన్నారు.




إرسال تعليق