భిక్నూర్ బస్టాండ్ లో ప్రమాదం - ఆర్టీసీ బస్సు కింద పడి ప్రయాణికుడికి తీవ్ర గాయాలు
కామారెడ్డి, భిక్నూర్, ఆగస్టు 29:
భిక్నూర్ మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో శనివారం ప్రమాదం జరిగింది.
దోమకొండ మండలానికి చెందిన పాపయ్య (40) అనే వ్యక్తి ఆర్టీసీ బస్సు ఎక్కుతుండగా ప్రమాదవశాత్తు కాలు బస్సు టైరు కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. బస్సులో రద్దీ ఎక్కువగా ఉండటంతో ఫుట్ బోర్డు పై ప్రయాణించేందుకు యత్నించిన క్రమంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
గాయపడిన వ్యక్తిని స్థానికులు వెంటనే కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.



إرسال تعليق