16న బిచ్కుందకు సీఎం రేవంత్ రెడ్డి రాక
ఎమ్మెల్యే లక్ష్మి కాంత్ రావు కుమార్తె వివాహ వేడుకల్లో హాజరు
ఏర్పాట్లను క్షుణ్ణంగా పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
బిచ్కుంద: జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు కుమార్తె వివాహ విందు కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి ఈ నెల 16న బిచ్కుందకు విచ్చేస్తున్నారు.
ఈ శుభకార్యం ఆగస్టు 16, 2026 ఉదయం 9:00 గంటలకు బిచ్కుందలోని DBL మైదానంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి జుక్కల్ నియోజకవర్గ ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు విచ్చేసి నూతన వధూవరులను ఆశీర్వదించాలని ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఆహ్వానించారు.
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, ఎస్పీ
సీఎం పర్యటన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మి కాంత్ రావు, డిసిసి అధ్యక్షులు మల్లికార్జున్ తో కలిసి బుధవారం బిచ్కుందలోని DBL మైదానం, హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించారు.
అధికారులు, పోలీసులు, స్థానిక నాయకులతో కలిసి వేదిక ఏర్పాట్లు, భద్రతా చర్యలు, బారికేడ్లు, పార్కింగ్, ట్రాఫిక్ నియంత్రణ తదితర అంశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు చేశారు.
అధికారులతో సమీక్షలో కలెక్టర్ మాట్లాడుతూ సీఎం పర్యటన సజావుగా సాగేలా అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. సీఎం ప్రయాణ మార్గంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ సూచించారు.
ఏర్పాట్లు వేగవంతం
సీఎం పర్యటన నేపథ్యంలో పోలీసు, రెవెన్యూ, మున్సిపల్ శాఖల అధికారులు బిచ్కుందలో ఏర్పాట్లను వేగవంతం చేశారు. ఎమ్మెల్యే ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు.ఈ నెల 16న జరగనున్న వివాహ విందుకు భారీగా జనం తరలి వచ్చే అవకాశం ఉండటంతో అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.






إرسال تعليق