Top News

Congress Protest | కామారెడ్డిలో కాంగ్రెస్ నిరసన ర్యాలీ

ఖర్గేను అవమానించిన ఘటనను ఖండిస్తూ కామారెడ్డి కాంగ్రెస్ నిరసన ర్యాలీ

కామారెడ్డి: ఏఐసీసీ అధ్యక్షులు  మల్లికార్జున్ ఖర్గే ని అవమానించేలా కుల వివక్షను ప్రదర్శించిన ఘటనను ఖండిస్తూ కామారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం భారీ నిరసన ర్యాలీ, ధర్నా నిర్వహించారు.

ఏఐసీసీ, పీసీసీ పిలుపు మేరకు, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్  ఆదేశాలతో ఈ కార్యక్రమం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షులు భూమని బాలరాజ్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఐరేని సందీప్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

కామారెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి ఇందిరా గాంధీ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఇందిరా చౌక్ వద్ద ధర్నా చేసి ఖర్గే గారిని అవమానించిన వారిపై చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ కుల వివక్షకు తావులేని సమాజ నిర్మాణం కోసం, రాజ్యాంగం, సమానత్వం, సామాజిక న్యాయం విలువలను పరిరక్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని తెలిపారు. దేశంలో ప్రతి ఒక్కరికీ సమాన గౌరవం, సమాన హక్కులు కల్పించడమే కాంగ్రెస్ సిద్ధాంతమని, కుల వివక్షకు వ్యతిరేకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

ఈ కార్యక్రమంలో గూడెం శ్రీనివాస్ రెడ్డి, గోనె శ్రీనివాస్, రాజా గౌడ్, కళ్లెం సత్యం, సాయిలు, కిరణ్, అజ్మత్, దీపక్, లక్కపతిని గంగాధర్ తదితర కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم