Top News

Councillor's Protest | కామారెడ్డిలో బీఆరెస్ కౌన్సిలర్ వినూతన నిరసన

కామారెడ్డి-కరీంనగర్ రహదారిపై నీటిలో కూర్చుని బీఆర్ఎస్ కౌన్సిలర్ నిరసన

వర్షం నీరు నిలవడంతో ప్రజలు ఇబ్బంది - అధికారుల నిర్లక్ష్యంపై ఆగ్రహం

కామారెడ్డి, ఆగస్టు 8:కామారెడ్డి-కరీంనగర్ ప్రధాన రహదారిపై పోలీస్ స్టేషన్ ముందు రైల్వే బ్రిడ్జి వద్ద వర్షం నీరు నిలిచి రాకపోకలకు అంతరాయం కలగడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ 47వ వార్డు కౌన్సిలర్ నిరసన వ్యక్తం చేశారు.

శనివారం ఉదయం కౌన్సిలర్ గెరింగంటి లక్ష్మీనారాయణ రోడ్డుపై నిలిచిపోయిన వర్షపు నీటిలో కూర్చుని అధికారుల తీరుకు నిరసన తెలిపారు. ప్రతిరోజు ఈ మార్గంలో తిరిగే ప్రజాప్రతినిధులు, అధికారులు కూడా ఈ సమస్యను పట్టించుకోవడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

పట్టణంలోని రైల్వే కమాన్ మీదుగా పాత బస్టాండ్ వెళ్లే దారిలో కమాన్ కింద వర్షం పడిన వెంటనే నీరు భారీగా నిలిచిపోతుందని తెలిపారు. అధికారులు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమవుతున్నారని ఆరోపించారు. నీటి నిల్వతో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుందని, ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయని హెచ్చరించారు.

పరిష్కారం చూపకపోతే దీక్ష

అధికారులు వెంటనే స్పందించి సమస్యకు పరిష్కారం చూపాలని కౌన్సిలర్ డిమాండ్ చేశారు. ఆసుపత్రికి వచ్చే రోగులు, ఇతర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. నీటి నిల్వకు శాశ్వత పరిష్కారం చూపకపోతే అక్కడే నిరసన దీక్ష చేపడతానని ఆయన హెచ్చరించారు.స్థానికులు కూడా ఈ సమస్యపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

Post a Comment

أحدث أقدم