కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో డీఐజీ సన్‌ప్రీత్ సింగ్ సమీక్ష
నేరాల కట్టడికి ఫోకస్ చేయాలని ఆదేశం
డీఎస్పీ కార్యాలయంలో వార్షిక తనిఖీ
కామారెడ్డి, ఆగస్టు 21: జోన్-III ఇన్‌చార్జ్ డీఐజీ, సైబరాబాద్ ట్రాఫిక్ జేసీపీ సన్‌ప్రీత్ సింగ్ శుక్రవారం కామారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా పోలీసు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర జిల్లాలోని శాంతిభద్రతలు, నేరాల నమోదు, దర్యాప్తు, కేసుల డిటెక్షన్, రోడ్డు ప్రమాదాల నివారణ చర్యలపై డీఐజీకి నివేదిక అందజేశారు.
సమీక్షలో డీఐజీ మాట్లాడుతూ కొన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో నేరాలు తగ్గినా, మరికొన్ని చోట్ల పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. పెరుగుతున్న నేరాలకు గల కారణాలను అధ్యయనం చేసి ప్రత్యేక వ్యూహాలతో కట్టడి చేయాలని సూచించారు.
పాత నేరస్తులపై గట్టి నిఘా
పాత నేరస్తుల కదలికలను ఎప్పటికప్పుడు గమనించాలని, వారి ఇళ్లకు వెళ్లి స్థానికులతో మాట్లాడి సమాచారం రాబట్టాలని ఆదేశించారు. నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించి కమ్యూనిటీ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలన్నారు.
ప్రమాదాలు, గంజాయిపై ప్రత్యేక దృష్టి
రోడ్డు ప్రమాదాలు జరిగిన ప్రతి చోటును అధికారులు స్వయంగా పరిశీలించి, కారణాలు గుర్తించి శాశ్వత పరిష్కారం చూపాలని చెప్పారు. గంజాయి సరఫరా, రవాణా ముఠాలను ఛేదించడంతో పాటు బాధితులకు డీ-అడిక్షన్ సేవలు అందించాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచాలని, గుట్కా, మట్కా, అక్రమ గేమింగ్‌ను ఉక్కుపాదంతో అణచాలని ఆదేశించారు.
సీసీటీవీలు, 5ఎస్ విధానం తప్పనిసరి
ప్రజా భద్రత కోసం సీసీటీవీల సంఖ్యను పెంచాలని, పోలీస్ స్టేషన్లలో 5ఎస్ విధానాన్ని పకడ్బందీగా అమలు చేయాలని తెలిపారు. సిబ్బంది నిజాయితీగా, ధైర్యంగా విధులు నిర్వర్తించాలని పిలుపునిచ్చారు.
అనంతరం డీఐజీ కామారెడ్డి డీఎస్పీ కార్యాలయాన్ని తనిఖీ చేసి రికార్డులు, కేసు ఫైళ్లు, కార్యాలయ పరిశుభ్రతను పరిశీలించారు. దర్యాప్తుల్లో జాప్యం ఉండకూడదని సూచించారు.
ఈ సమావేశంలో ఎస్పీ అడ్మిన్ కే. నరసింహారెడ్డి, కామారెడ్డి డీఎస్పీ మధుసూదన్, ఎల్లారెడ్డి డీఎస్పీ శ్రీనివాసరావు, బాన్సువాడ డీఎస్పీ విట్టల్ రెడ్డి, జిల్లా సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.







إرسال تعليق