Top News

Digital Classes Started | బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసుల ప్రారంభం

బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డిజిటల్ క్లాసుల ప్రారంభం

డిజిటల్ విద్యతో అభ్యాసం సులభం

విద్యార్థులతో ముచ్చటించిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి

బాన్సువాడ: బాన్సువాడ పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను శనివారం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు  పోచారం శ్రీనివాసరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా కళాశాలలో కొత్తగా ఏర్పాటు చేసిన డిజిటల్ క్లాసులను ప్రారంభించారు. కళాశాల ఆవరణ, తరగతి గదులు, విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

డిజిటల్ విద్యతో అభ్యాసం సులభం

ఈ సందర్భంగా పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, ప్రస్తుత యుగంలో సాంకేతిక పరిజ్ఞానం ప్రాముఖ్యత బాగా పెరిగిందని, డిజిటల్ క్లాసులు విద్యార్థుల అభ్యాసాన్ని మరింత సులభతరం చేస్తాయని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకువస్తోందని పేర్కొన్నారు.

విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యే భవిష్యత్తుకు బాటవేస్తుందని, ప్రతి విద్యార్థి లక్ష్యసాధన కోసం కృషి చేయాలని సూచించారు. సమయపాలన, క్రమశిక్షణ, గురువుల పట్ల గౌరవం ఉంటే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని తెలిపారు.డిజిటల్ క్లాసులను సద్వినియోగం చేసుకొని పాఠ్యాంశాలను లోతుగా అర్థం చేసుకోవాలని, సందేహాలను వెంటనే నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.

వీడియో 👇👇



విద్యార్థిని నుంచి కృతజ్ఞతలు

ఈ కార్యక్రమంలో వెంకటాపూర్ తండాకు చెందిన ఇంటర్మీడియట్ రెండవ సంవత్సరం విద్యార్థిని లక్ష్మీ మాట్లాడుతూ, గత సంవత్సరం అక్టోబర్ నెలలో హాస్టల్ నుండి కళాశాలకు రావడానికి తాము ఎదుర్కొన్న ప్రయాణ ఇబ్బందులను గుర్తించి వెంటనే ప్రత్యేక బస్సును ఏర్పాటు చేసిన పోచారం గారికి ధన్యవాదాలు తెలిపారు.

ఉన్నత విద్య కోసం SRNK డిగ్రీ కళాశాల, నర్సింగ్ కళాశాల ఏర్పాటు చేయడం ద్వారా బాన్సువాడ పట్టణాన్ని ఒక ఎడ్యుకేషనల్ హబ్ గా మార్చిన పోచారం సార్ కు విద్యార్థుల తరపున ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ సలాం, కళాశాల డెవలప్మెంట్ కమిటీ సభ్యులు మహ్మద్ ఏజాజ్, దాసరి శ్రీనివాస్, ఎర్వల కృష్ణారెడ్డి, బోధన సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.






Post a Comment

أحدث أقدم