బాన్సువాడలో విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ H-82 నూతన కార్యవర్గం ఏకగ్రీవ ఎన్నిక
బాన్సువాడ : తెలంగాణ విద్యుత్ ఎంప్లాయిస్ యూనియన్ H-82 బాన్సువాడ డివిజన్ నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. జిల్లా నాయకులు హరికృష్ణ ఆధ్వర్యంలో డివిజన్ పరిధిలోని విద్యుత్ కార్మికులందరి సమక్షంలో ఈ ఎన్నిక ప్రశాంత వాతావరణంలో నిర్వహించారు.
కార్మికుల సంక్షేమం, హక్కుల సాధనే ధ్యేయంగా నూతన బాడీని ఎన్నుకున్నట్లు ఈ సందర్భంగా నాయకులు తెలిపారు.
నూతన కార్యవర్గ వివరాలు:
- డివిజన్ అధ్యక్షులు: J. దత్తు
- డివిజన్ సెక్రెటరీ: A. బాలరాజ్
- వర్కింగ్ ప్రెసిడెంట్: రమేష్
- ట్రెజరర్: సందీప్ రెడ్డి
- ఉపాధ్యక్షులు: అశోక్ గౌడ్, ఎండి గౌస్, మార శ్రీనివాస్
- ఆర్గనైజింగ్ సెక్రెటరీలు: రాజు, ఎండి షాదుల్, రఘు కుమార్
- జాయింట్ సెక్రెటరీలు: శివరాం కుమార్, నాగయ్య, భగత్ సింగ్
- సోషల్ మీడియా మెంబర్: భగవాన్ ఇబ్రహీం
- ఎగ్జిక్యూటివ్ సభ్యులు: M. రమేష్, Ch. రాజు, నరేందర్, G. రాజు
కార్మికుల ఐక్యతతోనే డివిజన్ సమస్యలను పరిష్కరించుకోవచ్చని, ఉద్యోగుల హక్కుల పరిరక్షణకు నూతన కమిటీ నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గ సభ్యులకు తోటి ఉద్యోగులు, కార్మికులు అభినందనలు తెలిపారు.

إرسال تعليق