తెలంగాణ ప్రభుత్వ అనుమతి ఉన్నా అధికారుల నిర్లక్ష్యం - షేక్ గయాజుద్దీన్ ఆరోపణ
తెలంగాణ డైలీ న్యూస్, ఎల్లారెడ్డి :
తెలంగాణ ప్రభుత్వం ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీకి అనుమతి ఇచ్చినప్పటికీ కామారెడ్డి జిల్లాలో అధికారులు వాటిని జారీ చేయడం లేదని మాజీ జడ్పిటిసి, ఎల్లారెడ్డి ముస్లిం వెల్ఫేర్ కమిటీ అధ్యక్షులు షేక్ గయాజుద్దీన్ ఆరోపించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఎల్లారెడ్డి, బాన్సువాడ, కామారెడ్డి, జుక్కల్ నియోజకవర్గాల్లో అనేక మంది ప్రజలు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం దరఖాస్తు చేస్తున్నప్పటికీ రెవెన్యూ అధికారులు జారీ చేయడం లేదని తెలిపారు.
హైదరాబాద్ లోని సైదాబాద్ మండలంలో 30-07-2026 తేదీన ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ అయిన ఉదాహరణను ఆయన చూపించారు. రాష్ట్రంలో ఒకచోట జారీ చేస్తూ, మరోచోట జారీ చేయకపోవడం అధికారుల వివక్షకు నిదర్శనమని అన్నారు.
ప్రజలు వివిధ ప్రభుత్వ పథకాలకు, విద్య, ఉద్యోగ అవసరాలకు ఫ్యామిలీ సర్టిఫికెట్ కోసం ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి కామారెడ్డి జిల్లాలోని అన్ని మండలాల్లో ఫ్యామిలీ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ల జారీని తక్షణమే ప్రారంభించాలని షేక్ గయాజుద్దీన్ డిమాండ్ చేశారు.
![]() |
| హైదరాబాద్ లో జులై 30న జారీ చేసిన ఫ్యామిలీ సర్టిఫికెట్ |


إرسال تعليق