మందకృష్ణ మాదిగ నాయకత్వంలో నూతన శక్తులతో ఎమ్మార్పీఎస్ బలోపేతం
-బీర్కూర్ మండల ఎమ్మార్పీఎస్ నూతన కమిటీ ఎన్నిక
-ఎంఆర్పీయస్ కామారెడ్డి జిల్లా ఇంఛార్జి మంథని సామ్యెల్ మాదిగ
తెలంగాణ డైలీ న్యూస్, బీర్కూర్ :
32 సంవత్సరాల సుదీర్ఘ ఉద్యమం, వర్గీకరణ సాధన,అనేక సామాజిక అంశాలపై పోరాటం అనంతరం నూతన శక్తులతో ఉద్యమాన్ని బలోపేతం చేద్దామని ఎంఆర్పీయస్ కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంథని సామ్యేల్ మాదిగ ఉద్యమ శ్రేణులకు పిలుపునిచ్చారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో మంగళవారం ఎంఆర్పీయస్ మండల సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన అయన మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సాధన కోసం పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నాయకత్వంలో ఏర్పడ్డ ఎమ్మార్పీఎస్ మాదిగల ఉద్యమం చేస్తూనే మానవతా ఉద్యమం గా మారిందని, అనేక సామాజిక అంశాలపై ఉద్యమాలు చేసి విజయాలు సాధించిందని గుర్తు చేశారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ, గుండె జబ్బు పిల్లల ఉద్యమం ద్వారా 'ఆరోగ్య శ్రీ 'సాధన, వికలాంగుల మరియు వృద్దులు వితంతువుల పెన్షన్ పెంపు,ఉద్యోగుల ప్రమోషన్లో రిజర్వేషన్ సాధన రేషన్ బియ్యం పెంపు లాంటివి మచ్చు కు కొన్ని మాత్రమేనని అన్నారు. సామాజిక బాధ్యత గా మరిన్ని పోరాటాలు చేసి విజయాలు సాధించడానికి యువతరం, నూతన శక్తులతో బలోపేతం చేయాలని పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు ఎమ్మార్పీఎస్ ఉద్యమ పునః నిర్మాణం జరుగుతుందని తెలియ జేశారు. అన్ని మండలాలు, జిల్లా స్థాయిలో కమిటీల నూతన నిర్మాణాలలో నవతరం, విద్యావంతులైన యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు.
ఎంఆర్పీయస్ మండల నూతన అధ్యక్షుడిగా.....
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి బీర్కూర్ మండల అధ్యక్షుడిగా బీర్కూర్ మండల కేంద్రానికి చెందిన మెక్క రమేష్, ప్రధానకార్యదర్శిగా చించోలి గ్రామానికి చెందిన బసొల్ల కుమార్, కోశాధికారిగా బీర్కూర్ కు చెందిన నాని బాబు లను అదేవిధంగా సలహాదారులుగా రాంసాని భూమయ్య (బీర్కూర్), బోయి పెద్ద లాలయ్య (బరంగ్ ఏడ్గి), బసొల్ల శ్రీనివాస్ (చించోలి గ్రామ సర్పంచ్), మేత్రి చిన్న గంగారాం (అన్నారం) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీయస్ ప్రతినిధులు కాదేపురం గంగన్న, నాయకులు పెద్దబూరి గంగారాం, అసెంబ్లీ నియోజకవర్గ ఇంచార్జిలు మావురం శ్రీకాంత్, బోయి చిన్న సాయిలు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق