సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న మృతిపై TUWJ సంతాపం
కుటుంబానికి అండగా ఉంటాం – రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ
హైదరాబాద్: యూనియన్ కుటుంబ సభ్యుడు, ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న అకాల మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ, IJU) రాష్ట్ర కమిటీ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసింది.
TUWJ రాష్ట్ర అధ్యక్షులు విరాహత్ అలీ గురువారం ఒక ప్రకటన విడుదల చేస్తూ, ఆశన్న మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబానికి ఈ కష్ట సమయంలో యూనియన్ అండగా ఉంటుందని తెలిపారు.
సీనియర్ రిపోర్టర్ ఆశన్నకు భావోద్వేగ నివాళి
పార్థివ దేహానికి పుష్పాంజలి ఘటించిన జిల్లా పాత్రికేయులు
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా సీనియర్ పాత్రికేయులు సాలె ఆశన్న పార్థివ దేహానికి జిల్లా tuwj అధ్యక్షులు రజినీకాంత్ ఆధ్వర్యంలో జిల్లా సీనియర్ పాత్రికేయులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆశన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. ఆశన్న జర్నలిజం రంగానికి అందించిన సేవలు చిరస్మరణీయమని, ఆయన నిబద్ధత, నిజాయితీ, వృత్తిపట్ల అంకితభావం యువ పాత్రికేయులకు ఆదర్శంగా నిలుస్తాయని పేర్కొన్నారు.
ఆశన్న మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని అంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు శ్రీనివాస్, రాజేష్, చందు, సతీష్, ఎల్లారెడ్డి, బాన్సువాడ, జుక్కల్ నియోజకవర్గ సీనియర్ పాత్రికేయులు పాల్గొని పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.



إرسال تعليق