Top News

MLA PSR | సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన పోచారం

సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను పరిశీలించిన పోచారం 

10 వేల ఎకరాలకు సాగునీటి సమస్య తీరుతుంది – పోచారం

బాన్సువాడ: వర్ని మండలం సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణ పనులను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు  పోచారం శ్రీనివాస్ రెడ్డి గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా రిజర్వాయర్ నిర్మాణ పురోగతిపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. నాలుగు బండ్లలో భాగంగా మొదటి బండ్ నిర్మాణం పూర్తయిందని, అందులో రెండు స్లూయిస్‌ల నిర్మాణం కూడా పూర్తయినట్లు అధికారులు వివరించారు.

పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ, గతంలో సిద్దాపూర్ చెరువులో ఉండే నీటి నిల్వ సామర్థ్యంతో పోలిస్తే ప్రస్తుతం దాదాపు రెట్టింపు స్థాయిలో నీటిని నిల్వ చేసే అవకాశం కలిగిందని తెలిపారు. కట్ట ఎత్తు సుమారు 5 మీటర్లు పెరగడం వల్ల రిజర్వాయర్ నిల్వ సామర్థ్యం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు.

ఈ నిర్మాణం వల్ల సిద్దాపూర్ పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాల స్థాయి పెరిగే అవకాశం ఉందని, ఆయకట్టు పరిధిలోని వ్యవసాయ భూములకు వానాకాలం, వేసవి పంటలకు అవసరమైన నీరు ఇప్పటికే నిల్వ ఉందని వివరించారు. దీంతో రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని స్పష్టం చేశారు.

రిజర్వాయర్ నిర్మాణంలో నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటిస్తూ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశించారు. 

సిద్దాపూర్ రిజర్వాయర్ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆయకట్టు పరిధిలోని సుమారు 10 వేల ఎకరాలకు సాగునీటి సమస్య పూర్తిగా పరిష్కారమవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ పర్యటనలో స్థానిక ప్రజాప్రతినిధులు, నీటిపారుదల శాఖ అధికారులు, ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు.  వీడియో 👇




బాన్సువాడలో ఘనంగా ఆచార్య జయశంకర్ జయంతి 

పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాసుల బాలరాజు నివాళులు

 తెలంగాణ సిద్ధాంతకర్త, ఆచార్య ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా బాన్సువాడ పట్టణ కేంద్రంలోని జయశంకర్ సార్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసన సభ్యులు పోచారం శ్రీనివాస రెడ్డి, రాష్ట్ర ఆగ్రోస్ ఛైర్మెన్ కాసుల బాలరాజు పాల్గొన్నారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచార్య జయశంకర్ సార్ తెలంగాణ ఆత్మగౌరవం, అభివృద్ధి కోసం చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఆయన చూపిన బాటలో నడిచి తెలంగాణను అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో బాన్సువాడ పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Post a Comment

أحدث أقدم