Top News

Ganja Smuggling | కామారెడ్డి రైల్వే స్టేషన్ లో సంయుక్త తనిఖీలు

కామారెడ్డి రైల్వే స్టేషన్ లో సంయుక్త తనిఖీలు

6 కిలోల గంజాయి స్వాధీనం

నిందితులు పరార్

కామారెడ్డి:  ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రోహిబిషన్ & ఎక్సైజ్ డిప్యూటి కమిషనర్  శ్రీధర్, కామారెడ్డి జిల్లా మధ్య నిషేధ అధికారి  ముకుందరెడ్డి ఆదేశాల మేరకు కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది సంయుక్త తనిఖీలు నిర్వహించారు.

సికింద్రాబాద్ నుండి నాందేడ్ వెళ్లే నాగవల్లి ఎక్స్‌ప్రెస్ రైలులో అనుమానాస్పదంగా గంజాయి తరలిస్తున్నారనే సమాచారంతో కామారెడ్డి ఎక్సైజ్ స్టేషన్ సిబ్బంది, జిల్లా టాస్క్‌ఫోర్స్, రైల్వే పోలీసులు కలిసి తనిఖీలు చేపట్టారు.

6 కిలోల గంజాయి సీజ్  

ఈ తనిఖీల్లో రైలులో దాచిపెట్టిన సుమారు 6 కిలోల గంజాయిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే నిందితులు ఎవరూ పట్టుబడలేదు. నిందితుల కోసం గాలింపు కొనసాగుతుందని కామారెడ్డి ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ తెలిపారు.

పాల్గొన్న అధికారులు

ఈ ఆపరేషన్‌లో కామారెడ్డి ఎక్సైజ్ సిఐ సంపత్ కృష్ణ, డిటిఎఫ్ ఇన్స్పెక్టర్ సుందర్ కృష్ణన్, ఎస్ఐలు విక్రమ్ కుమార్, శ్రీనివాస రావు, శరత్ కుమార్, ట్రైనీ ఎస్ఐలు అనిల్, మధు తో పాటు జాన్, షరీఫ్, అమృత్ రెడ్డి, శంకర్, పవన్, సర్మిల, శరత్, దినేష్, రాజు తదితర సిబ్బంది పాల్గొన్నారు.

రైళ్ల ద్వారా మత్తు పదార్థాల అక్రమ రవాణాను అరికట్టేందుకు ఇలాంటి తనిఖీలు నిరంతరం కొనసాగుతాయని అధికారులు తెలిపారు.



Post a Comment

أحدث أقدم