జగిత్యాలలో తప్పిన పెను ప్రమాదం
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు
జగిత్యాల: మద్దునూర్ నుంచి జగిత్యాల వస్తున్న ఆర్టీసీ బస్సులో తీవ్ర కలకలం రేగింది. బస్సు డ్రైవర్ లక్ష్మణ్‌కు ఒక్కసారిగా గుండెపోటు రావడంతో స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయారు.
అయితే గుండెపోటు వచ్చే సమయంలోనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును స్లో చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వెంటనే ప్రయాణికులు బస్సును అదుపులోకి తీసుకున్నారు.
డ్రైవర్‌ను ఆసుపత్రికి తరలించేందుకు 108కు ఫోన్ చేసినా స్పందించలేదని ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆటోలోనే జగిత్యాల ఆసుపత్రికి తరలించారు.
సోమవారం డ్రైవర్ లక్ష్మణ్ రిటైర్మెంట్ కావాల్సి ఉందని సమాచారం. తన ఆరోగ్యం సహకరించడం లేదని, వేరే డ్యూటీ ఇవ్వాలని కోరినా డ్రైవింగ్ డ్యూటీ వేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.



إرسال تعليق