కామారెడ్డి మున్సిపల్ సర్వసభ్య సమావేశంలో రసాభాస
బీఆరెస్, బిజెపి కౌన్సిలర్ల నిరసన
కామారెడ్డి: కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశం ఆరోపణలు, ప్రత్యారోపణలతో రసాభాసగా మారింది.
వార్డుల్లో తమకు సమాచారం ఇవ్వకుండానే అభివృద్ధి పనులు చేపడుతున్నారంటూ బీఆర్ఎస్ కౌన్సిలర్లు పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలిపారు. సమాచారం ఇవ్వకపోతే పదవులకు రాజీనామా చేస్తామని హెచ్చరించారు.
అదే సమయంలో బీజేపీ కౌన్సిలర్లు సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో కాంగ్రెస్ నాయకులు ఆగ్రహానికి గురయ్యారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకోగా కాంగ్రెస్ నేతలు కుర్చీలు ధ్వంసం చేశారని సమాచారం.
మున్సిపాలిటీలో అక్రమ కట్టడాలను కాంగ్రెస్ కౌన్సిలర్లు ప్రోత్సహిస్తున్నారని బీజేపీ కౌన్సిలర్లు ఆరోపించడంతో సమావేశం తీవ్ర గందరగోళంగా ముగిసింది.
కామారెడ్డి మున్సిపల్ అత్యవసర కౌన్సిల్ భేటీ
కామారెడ్డి పురపాలక సంఘ అత్యవసర సమావేశం శనివారం మున్సిపల్ సమావేశ మందిరంలో చైర్ పర్సన్ అధ్యక్షతన జరిగింది.
ఈ సమావేశంలో మొత్తం 9 ఎజెండా అంశాలను చర్చించి కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది.
పట్టణంలోని ప్రతి వార్డుకు రూ.6 లక్షల చొప్పున అభివృద్ధి నిధులు కేటాయించే ప్రతిపాదనకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఆయా వార్డుల్లో అవసరమైన అభివృద్ధి పనులు చేపట్టనున్నారు.
ఈ సందర్భంగా అదనపు స్థానిక సంస్థల కలెక్టర్ ఎన్.వై.గిరి మాట్లాడుతూ పట్టణ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించేందుకు ప్రణాళికాబద్ధంగా పనులు చేపట్టాలని సూచించారు. వార్డుల వారీగా ప్రజల అవసరాలను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో నాణ్యతతో, నిర్ణీత గడువులో పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.
సమావేశంలో మున్సిపల్ కమిషనర్, కౌన్సిలర్లు, కో-ఆప్షన్ సభ్యులు, ఇంజనీరింగ్, టౌన్ ప్లానింగ్ అధికారులు పాల్గొన్నారు.




إرسال تعليق