Top News

Heavy Rain | జిల్లాలో భారీ వర్షాలు, 636% అధిక వర్షపాతం

 

జిల్లాలో భారీ వర్షాలు, 636% అధిక వర్షపాతం  

నిజాంసాగర్‌లో 9 టీఎంసీలకు చేరిన నీటినిల్వ  

పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయికి చేరువ  

కళ్యాణి ప్రాజెక్టు 2 గేట్లు ఎత్తివేత  

లింగంపేట్‌లో పాములవాగు ఉధృతి

కామారెడ్డి - ఎల్లారెడ్డి మధ్య రాకపోకలకు అంతరాయం  

తెలంగాణ డైలీ న్యూస్, కామారెడ్డి : 

కామారెడ్డి జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రాజెక్టులు, వాగులు నిండుకుంటుండగా, జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతిభారీ వర్షపాతం నమోదైంది.

తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం ఈరోజు జిల్లా సగటు వర్షపాతం 71.4 మి.మీ నమోదైంది. సాధారణం 9.7 మి.మీతో పోలిస్తే 636% అధికంగా ఉంది. సీజన్ సంచిత వర్షపాతం 568.0 మి.మీగా ఉండగా, సాధారణ సంచితం 422.5 మి.మీతో పోలిస్తే 34% ఎక్కువగా ఉంది. జిల్లాలోని 25 మండలాల్లో 4 మండలాల్లో లార్జ్ ఎక్సెస్, 13 మండలాల్లో ఎక్సెస్, 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. కామారెడ్డి మండలంలో 137.2 మి.మీ - 1103% ఎక్సెస్, బస్వాడలో 135.2 మి.మీ - 1187% ఎక్సెస్, మొహమ్మద్‌నగర్‌లో 124.8 మి.మీ - 1123% ఎక్సెస్, భిక్నూర్‌లో 42.1 మి.మీ - 262% ఎక్సెస్‌తో అత్యధిక వర్షపాతం నమోదైంది. పిట్లాం, నిజాంసాగర్, తడ్వాయి, గాంధారి, సదాశివనగర్ సహా 13 మండలాల్లో ఎక్సెస్ వర్షపాతం నమోదైంది.








👉భారీ వర్షాలతో ప్రాజెక్టులకు భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. నిజాంసాగర్ ప్రాజెక్టులో ఈరోజు ఉదయం 6 గంటలకు నీటిమట్టం 1397.57 అడుగులుగా ఉండగా, నీటినిల్వ 8.936 టీఎంసీలకు చేరింది. 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 6060 క్యూసెక్కులుగా ఉంది. రాత్రి కురిసిన వర్షాలతో మరింత ఇన్‌ఫ్లో పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

👉నాగిరెడ్డిపేట మండలంలోని పోచారం ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1464 అడుగులు, సామర్థ్యం 1.820 టీఎంసీలు. ప్రస్తుతం 1.575 టీఎంసీల నిల్వ ఉండగా, 2150 నుంచి 2200 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్టు పై నుండి వెళ్తున్న వరద నీరు నిజాంసాగర్‌లోకి చేరుతోంది. త్వరలో ప్రాజెక్టు పూర్తిస్థాయిలో నిండే అవకాశం ఉంది.

👉ఎల్లారెడ్డి మండలంలోని కళ్యాణి మినీ ప్రాజెక్టు 409 అడుగుల పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకోవడంతో ఇరిగేషన్ అధికారులు 2 గేట్లు ఎత్తి 100 క్యూసెక్కుల వరద నీటిని దిగువకు వదులుతున్నారు. ప్రస్తుతం ఇన్‌ఫ్లో, అవుట్‌ఫ్లో రెండూ 100 క్యూసెక్కులుగా ఉన్నాయి.

👉లింగంపేట్ మండలంలో పాములవాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. గత సంవత్సరం వరదలకు కొట్టుకుపోయిన వంతెన వద్ద కామారెడ్డి నుండి లింగంపేట్‌కు వచ్చే బస్సు రాకపోకలు నిలిచిపోయాయి.

భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు, కల్వర్టులు దాటేందుకు ప్రయత్నించవద్దని జిల్లా అధికారులు సూచించారు.

వీడియో 👇👇



1 تعليقات

إرسال تعليق

أحدث أقدم