కామారెడ్డి ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా ప్రతిమా సింగ్
సెప్టెంబర్ 10 వరకు విదేశీ పర్యటనలో ఆశిష్ సాంగ్వాన్
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సోమవారం (ఆగస్టు 24) నుంచి సెలవుపై వెళ్లనున్నారు. వ్యక్తిగత పర్యటన నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తుండటంతో, సెప్టెంబర్ 10 వరకు ఆయన సెలవులో ఉండనున్నారు.
ఈ నేపథ్యంలో కలెక్టర్ సెలవులో ఉన్న కాలంలో, కామారెడ్డి జిల్లా ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్‌కు బాధ్యతలు అప్పగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె త్వరలోనే ఇన్‌చార్జ్ కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.

إرسال تعليق