ఉమ్మడి జిల్లాలో నిండుతున్న జల వనరులు..!
కౌలాస్ నాలాకు పోటెత్తిన వరద!
నిజాంసాగర్ లో 12.54 టీఎంసీల నీరు, 3185 ఇన్ ఫ్లో
శ్రీరాంసాగర్ లో 44.48 టీఎంసీల నీరు, 2894 ఇన్ ఫ్లో
నిజామాబాద్ : ఉమ్మడి జిల్లాలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల ప్రభావంతో ప్రాజెక్టులు, రిజర్వాయర్లలో నీటిమట్టాలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇరిగేషన్ శాఖ అధికారులు లోతట్టు ప్రాంతాల ప్రజలకు హెచ్చరికలు జారీ చేశారు.
కౌలాస్ నాలాకు భారీగా వరద ప్రవాహం.. జుక్కల్ మండలంలోని కౌలాస్ నాలా ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద నీరు భారీగా వచ్చి చేరుతోంది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం (FRL) 458.0 మీటర్లు కాగా, ప్రస్తుతం నీటి మట్టం 457.60 మీటర్లకు చేరింది. ఎగువ పరివాహక ప్రాంతాల నుంచి ప్రవాహం ఇదే విధంగా కొనసాగితే రానున్న 24 గంటల్లో ప్రాజెక్టు గేట్లు ఎత్తి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి విడుదల చేసే అవకాశం ఉందని ఇరిగేషన్ ఏఈ సుకుమార్ రెడ్డి తెలిపారు. నది మరియు వరద కాలువ పరిసర ప్రాంతాలకు ప్రజలు, గొర్రెల కాపరులు, రైతులు ఎవరూ వెళ్లవద్దని, మూగజీవాలను అప్రమత్తంగా ఉంచాలని హెచ్చరిక జారీ చేశారు. రెవెన్యూ, పోలీసు శాఖల సహకారంతో గ్రాపాల్లో అధికారులు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు.
నిజాంసాగర్ ప్రాజెక్ట్ నీటి నిల్వ వివరాలు:
- పూర్తి స్థాయి నీటి మట్టం (FRL): 1405.00 అడుగులు (మొత్తం సామర్థ్యం: 17.802 టీఎంసీలు)
- ప్రస్తుత నీటి మట్టం (ఉదయం 6:00 గంటలకు): 1401.06 అడుగులు (నీటి నిల్వ: 12.541 టీఎంసీలు)
- గత ఏడాది ఇదే సమయానికి నీటి మట్టం 1404.31 అడుగులు (16.805 టీఎంసీలు) ఉండగా, ప్రస్తుతం నిల్వ కొంత తక్కువగా ఉంది.
- ప్రాజెక్టులోకి 24 గంటల సగటు ఇన్‌ఫ్లో 3,185 క్యూసెక్కులు వస్తుండగా.. అవుట్‌ఫ్లో ఆవిరి రూపంలో ఉన్న 205 క్యూసెక్కులు మాత్రమే పోతోంది. స్పిల్‌వే, జెన్‌కో, మెయిన్ కెనాల్ ద్వారా ఎలాంటి నీటి విడుదల లేదు.

- శ్రీరామసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం వివరాలు
- తేదీ: 24-08-2026, ఉదయం 6:00 గంటలకు
- గరిష్ట నీటిమట్టం (FRL): 1091.00 అడుగులు (80.50 టీఎంసీలు)
- ప్రస్తుత నీటిమట్టం: 1079.80 అడుగులు (44.48 టీఎంసీలు)
నేటి ప్రధాన విశేషాలు:
- ఇన్‌ఫ్లో (Inflow): ప్రాజెక్టులోకి ఎగువ ప్రాంతాల నుంచి 2,894 క్యూసెక్కుల సగటు వరద నీరు వచ్చి చేరుతోంది.
- అవుట్‌ఫ్లో (Outflow): వివిధ అవసరాల నిమిత్తం ప్రాజెక్టు నుంచి 963 క్యూసెక్కుల నీటిని బయటకు విడుదల చేస్తున్నారు.
నీటి విడుదల వివరాలు (క్యూసెక్కుల్లో):
- కాకతీయ కాలువ / విద్యుత్ ఉత్పత్తి: 250 క్యూసెక్కులు
- మిషన్ భగీరథ తాగునీటి అవసరాలు: 231 క్యూసెక్కులు (కొరుట్ల - జగిత్యాల: 61, ఆదిలాబాద్ - నిర్మల్: 63, ఆర్మూర్ - నిజామాబాద్ - కామారెడ్డి: 108 క్యూసెక్కులు)
- బాష్పీభవనం (Evaporation losses): 482 క్యూసెక్కులు
- స్పిల్‌వే, ఐఎఫ్‌ఎఫ్‌సీ, ఎస్కేప్ గేట్లు, లక్ష్మి, సరస్వతి, అలీసాగర్, గుప్తా మరియు ఐడీసీ (NZB+NRML) కాలువలు: ప్రస్తుతం నీటి విడుదల లేదని (NIL) ప్రాజెక్టు వర్గాలు వెల్లడించాయి.
ఈ ఏడాది సీజన్ నిల్వలు (జూన్ 01 నుండి ఇప్పటివరకు):
- మొత్తం ఇన్‌ఫ్లో: 34.620 టీఎంసీలు
- మొత్తం అవుట్‌ఫ్లో: 6.398 టీఎంసీలు
(గత ఏడాది ఇదే సమయానికి ప్రాజెక్టు నీటిమట్టం 1090.90 అడుగులు కాగా, 80.053 టీఎంసీల నీరు నిల్వ ఉంది.)
కల్యాణి ప్రాజెక్ట్ & సింగితం రిజర్వాయర్:
- నిజాంసాగర్ ప్రధాన కాలువ డైవర్షన్ పథకమైన కల్యాణి ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 408.0 మీటర్లు (గరిష్టం 409.50 మీ.) ఉండగా, 331 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. వచ్చిన నీరు వచ్చినట్లుగా ఫ్లడ్ గేట్ల ద్వారా సర్ ప్లస్ రూపంలో వెళ్తోంది.
- సింగితం రిజర్వాయర్లోకి 442 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. ఆ నీటిని పూర్తిగా నిజాంసాగర్ ప్రధాన కాలువకు మళ్లిస్తున్నారు. రిజర్వాయర్ నీటి మట్టం 415.695 మీటర్లుగా నమోదైంది. పోచారం ప్రాజెక్టు ఇప్పటికే నిండు కుండలా ఉంది.

إرسال تعليق