Top News

Koulas Nala | కౌలాస్ నాలా ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు

కౌలాస్ నాలా ప్రాజెక్ట్ లో భారీగా వరద నీరు – రంగంలోకి దిగిన జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు

  • వరద పరిస్థితిపై హైదరాబాద్‌ నుంచి హుటాహుటిన చేరుకుని స్వయంగా పర్యవేక్షణ
  • ప్రజల భద్రత కోసం తక్షణ నీటి మళ్లింపు చర్యలు చేపట్టిన అధికారులు, ఎమ్మెల్యే

 జుక్కల్: జుక్కల్ నియోజకవర్గంలోని ప్రతిష్టాత్మక కౌలాస్ నాలా ప్రాజెక్ట్‌లో నీటి మట్టం గరిష్ట స్థాయికి చేరుకుంటున్న నేపథ్యంలో... ప్రజల రక్షణే ధ్యేయంగా జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తక్షణ చర్యలకు ఉపక్రమించారు.

ప్రాజెక్టులో నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుతుందన్న సమాచారం అందుకున్న ఆయన, ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే హైదరాబాద్‌ నుంచి బయలుదేరి నేరుగా కౌలాస్ నాలా ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నారు. అక్కడ నెలకొన్న వరద పరిస్థితిని అధికారులతో కలిసి సమీక్షించారు.

అప్రమత్తమైన యంత్రాంగం.. నీటి మళ్లింపు చర్యలు భారీ వరద ప్రవాహం నేపథ్యంలో ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా ముందస్తు రక్షణ చర్యలపై ఎమ్మెల్యే అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన స్వయంగా దగ్గరుండి అదనపు నీటిని కౌలాస్ నాలా వాగులోకి సురక్షితంగా మళ్లించేలా చర్యలు చేపట్టారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయక చర్యలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ఆయన భరోసా ఇచ్చేశారు.

ప్రజా సమస్యలపై ఎప్పుడూ ముందుండే ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు  స్వయంగా రంగంలోకి దిగి పర్యవేక్షించడం పట్ల స్థానిక ప్రజలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.






Post a Comment

أحدث أقدم