30న హసన్ టాక్లీకి పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ రాక
హసన్ టాక్లీకి మానవతావాదులంతా తరలిరండి - సర్పంచ్ నక్కేవార్ దత్తు పిలుపు
డోంగ్లి / మద్నూర్, ఆగస్టు 28: సామాజిక ఉద్యమ నాయకులు, మానవతావాది, MRPS వ్యవస్థాపక అధ్యక్షులు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఈనెల 30వ తేదీన కామారెడ్డి జిల్లా డోంగ్లి మండలంలోని హసన్ టాక్లీ గ్రామానికి విచ్చేస్తున్నందున మానవతావాదులంతా తరలి రావాలని హసన్ టాక్లీ గ్రామ సర్పంచ్ నక్కేవార్ దత్తు పిలుపునిచ్చారు.
శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేస్తూ.. తమ గ్రామంలో లోక్ షాహిర్ అన్నాబావు సాఠే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆ విగ్రహ ఆవిష్కరణకు పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు.
మంద కృష్ణ మాదిగ పద్మశ్రీ అవార్డు అందుకున్న తర్వాత, అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ సాధించిన తర్వాత జుక్కల్ నియోజకవర్గానికి తొలిసారిగా వస్తున్నారని తెలిపారు. కాబట్టి మాదిగ, మాదిగ ఉపకులాలకు చెందిన వారితో పాటు మంద కృష్ణ మాదిగ చేపట్టిన సామాజిక ఉద్యమాల ద్వారా లబ్ధి పొందిన ఆరోగ్యశ్రీ, వికలాంగులు, రేషన్ బియ్యం లబ్ధిదారులంతా హసన్ టాక్లీ గ్రామానికి విచ్చేసి మంద కృష్ణ మాదిగకు మద్దతు పలకాలని కోరారు.
ఈనెల 30వ తేదీ ఆదివారం జరిగే అన్నాబావు సాఠే విగ్రహావిష్కరణ సభను ప్రతి ఒక్కరూ విచ్చేసి విజయవంతం చేయాలని సర్పంచ్ దత్తు విజ్ఞప్తి చేశారు.

إرسال تعليق