Top News

Fake Notes Rocket | కామారెడ్డి జిల్లాలో అంతర్ రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

కామారెడ్డి జిల్లాలో అంతర్ రాష్ట్ర నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు

182 నకిలీ 500 నోట్లు, కారు, ఫోన్లు స్వాధీనం - ముగ్గురు అరెస్ట్

బాన్సువాడ, ఆగస్టు 28: నకిలీ కరెన్సీని కొనుగోలు చేసి చలామణి చేస్తున్న అంతర్ రాష్ట్ర ముఠా గుట్టును బాన్సువాడ పోలీసులు రట్టు చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక దర్యాప్తులో ముగ్గురు నిందితులు పట్టుబడ్డారు. బాన్సువాడ డి ఎస్పీ విఠల్ రెడ్డి శుక్రవారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.

స్వాధీనం చేసుకున్నవి:

> 182 నకిలీ రూ.500 నోట్లు - విలువ రూ.91,000/-

> SWIFT DEZIRE కారు (MH-38-V-2837)

> 3 మొబైల్ ఫోన్లు

అసలేం జరిగింది?

మహారాష్ట్రలోని పర్భణి జిల్లాకు చెందిన రాహుల్ రావుసాహెబ్ ఆవాడ్ (23) కు పరిచయమైన ఒక వ్యక్తి ద్వారా హైదరాబాద్ కు చెందిన ముదస్సర్ హుస్సేన్ @ షాబాబా వద్ద నకిలీ కరెన్సీ లభిస్తుందని తెలిసింది.

రూ.1,00,000/- అసలు కరెన్సీ ఇస్తే రూ.2,00,000/- నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పడంతో, నిందితులు ప్రింటర్, దీని ఇంక్ లతో కలిసి డబ్బు సమకూర్చుకుని హైదరాబాద్ కు వెళ్లి అక్కడ ముదస్సర్ వద్ద నకిలీ కరెన్సీని తీసుకుని మహారాష్ట్రకు తిరిగి వెళ్తున్న సమయంలో పిట్లం హైవే సమీపంలోని పెట్రోల్ బంక్ లో నాలుగు రూ.500/- నకిలీ నోట్లను చలామణి చేస్తుండగా దర్యాప్తులో పట్టుబడ్డారు.

తదుపరి నకిలీ కరెన్సీని మరింత చలామణి చేసేందుకు హైదరాబాద్ కు వెళ్తుండగా ధర్మారం టోల్ ప్లాజా సమీపంలో పోలీసులు నిందితులైన ముదస్సార్, ప్రతీక్, భీమ్ శంకర్ లను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 182 నకిలీ నోట్లు, నకిలీ తయారీకి ఉపయోగించిన 3 మొబైల్ ఫోన్లు మరియు కారును స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసులో నకిలీ కరెన్సీని సరఫరా చేసిన తదితర పాత్రలపై దర్యాప్తు కొనసాగుతోంది. నకిలీ కరెన్సీ నెట్ వర్క్, ఇతర రాష్ట్రాల్లోని సంబంధాలపై కూడా విచారణ జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ప్రజలకు విజ్ఞప్తి:

సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల ద్వారా తక్కువ మొత్తంలో అసలు డబ్బులు ఇస్తే రెట్టింపు నకిలీ కరెన్సీ ఇస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దు. నకిలీ కరెన్సీని కొనుగోలు చేయడం, కలిగి ఉండడం లేదా చలామణి చేయడం తీవ్రమైన నేరం. ఇలాంటి సమాచారం తెలిసిన వెంటనే పోలీసులకు తెలియజేయాలని ప్రజలను కోరుతున్నామని ఎస్పీ తెలిపారు.

నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పిట్లం SI ఆంజనేయులు, బాన్సువాడ రూరల్ CI తిరుపయ్య, పిట్లం పోలీస్ సిబ్బంది శేఖర్, రాము, వెంకటేశ్ లను జిల్లా ఎస్పీ అభినందించారు.



Post a Comment

أحدث أقدم