ముఖ్య అతిథిగా మంద కృష్ణ మాదిగ
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా డోంగ్లీ మండలం హసన్‌టాక్లీ గ్రామంలో సాహిత్య సామ్రాట్, లోక్‌షాహిర్ అన్నాభావు సాఠె నూతన విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఈనెల 30వ తేదీన నిర్వహిస్తున్నామని గ్రామ సర్పంచ్ నక్కేవార్ దత్తు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సామాజిక ఉద్యమ నాయకులు, ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ విచ్చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ మేరకు గురువారం హైదరాబాద్‌లోని మంద కృష్ణ మాదిగ నివాసంలో ఎంఆర్పీఎస్ కామారెడ్డి జిల్లా ఇంచార్జి మంథని సామ్యేల్ మాదిగ నేతృత్వంలో, తెలంగాణ ఎస్సీ, ఎస్టీ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కాదేపురం గంగన్న ఆధ్వర్యంలో సర్పంచ్ దత్తు మర్యాదపూర్వకంగా కలిసి ఆహ్వానపత్రికను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ దత్తు మాట్లాడుతూ, మహనీయుల విగ్రహాలను ఏర్పాటు చేసుకోవడం అంటే వారి ఆశయాలను, త్యాగాలను స్మరించుకోవడమేనని అన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి గ్రామ ప్రజలు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొనాలని కోరారు.ఈ సమావేశంలో గ్రామ ప్రతినిధులు నక్కేవార్ లాలు, బక్కావార్ సాయిలు, నక్కేవార్ మారుతి, సాయినాథ్, బోయి సతీష్, అంకుష్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق