సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న మృతిపై TUWJ ఎలక్ట్రానిక్ మీడియా విభాగం సంతాపం
ఆయన సేవలు చిరస్మరణీయం – జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్
కామారెడ్డి: TUWJ (IJU) సభ్యుడు, ఆంధ్రజ్యోతి సీనియర్ రిపోర్టర్ సాలె ఆశన్న అకాల మృతి పట్ల తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (TUWJ) జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా విభాగం అధ్యక్షులు శ్రీనివాస్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు.
ఆశన్న మరణం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆయన, 25 సంవత్సరాలుగా నిర్భయంగా, నిబద్ధతతో జర్నలిజం చేస్తూ ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చారని కొనియాడారు.
గురువారం ఆశన్న స్వగ్రామం ఆరేడులో జరిగిన అంత్యక్రియల్లో శ్రీనివాస్ పాల్గొని ఆశన్న పార్థివ దేహానికి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆశన్న కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఆశన్న మరణం పాత్రికేయ రంగానికి తీరని లోటని అంటూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థించారు.

إرسال تعليق