Top News

Mega Job Mela | ఎల్లారెడ్డిలో ఘనంగా మెగా జాబ్ మేళ

ఎల్లారెడ్డిలో ఘనంగా మెగా జాబ్ మేళా–2026 ప్రారంభం

యూవత నుంచి అపూర్వ స్పందన

7,000కు పైగా రిజిస్ట్రేషన్లు

ఎల్లారెడ్డి: నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 'మెగా జాబ్ మేళా–2026' అత్యంత వైభవంగా ప్రారంభమైంది. స్థానిక ఎమ్మెల్యే  మదన్ మోహన్  ప్రత్యేక చొరవతో, మదన్ మోహన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు.

ఈ జాబ్ మేళాకు నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న యువతీ యువకుల నుంచి ఊహించని విధంగా భారీ స్పందన లభిస్తోంది. ప్రారంభ రోజునే ఎలాంటి ఇబ్బందులు లేకుండా యువత ఉత్సాహంగా తరలివచ్చి, ఇప్పటికే 7,000కు పైగా అభ్యర్థులు పేర్లు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు.

సందర్శించిన ఎమ్మెల్యే మదన్ మోహన్: ఈ మెగా జాబ్ మేళా వేదికను ఎల్లారెడ్డి ఎమ్మెల్యే  మదన్ మోహన్  సందర్శించారు. వివిధ కంపెనీల ప్రతినిధులు నిర్వహిస్తున్న ఇంటర్వ్యూల సరళిని, ఎంపిక ప్రక్రియను ఆయన దగ్గరుండి పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు అభ్యర్థులతో మాట్లాడి, వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపారు. చదువుకున్న ప్రతి ఒక్కరికీ ఉపాధి లభించేలా తమ వంతు కృషి చేస్తామని, యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో స్థిరపడాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో వివిధ ప్రముఖ కంపెనీల ప్రతినిధులు, ట్రస్ట్ సభ్యులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.





Post a Comment

أحدث أقدم