Top News

MLA PSR HELP | మాజీ సర్పంచ్ కుటుంబానికి పోచారం లక్ష ఆర్థిక సాయం

మాజీ సర్పంచ్ కుటుంబానికి పోచారం శ్రీనివాస్ రెడ్డి లక్ష ఆర్థిక సాయం

బాన్సువాడ, ఆగస్టు 30:

తగిలేపల్లి గ్రామ మాజీ సర్పంచ్ వెంకన్న కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయం తెలుసుకున్న ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించారు. తన సొంత నిధుల నుండి రూ. లక్ష ఆర్థిక సాయాన్ని వెంకన్న కుటుంబానికి అందజేశారు. ఆయనతో పాటు డిసిసిబి మాజీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి ఉన్నారు.

ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ.. "పోచారం శ్రీనివాస్ రెడ్డి  ఎల్లప్పుడూ పేద, బడుగు, బలహీన వర్గాలకు, ఆపదలో ఉన్న ప్రతి ఒక్కరికీ అండగా నిలుస్తున్నారు. ఇలాంటి నాయకుడు మనకు ఉండడం అదృష్టం. ఆయన ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం" అని కృతజ్ఞతలు తెలిపారు.

Post a Comment

أحدث أقدم