సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది మేనకా గురుస్వామి
హైదరాబాద్, ఆగస్టు 30: రాజ్యాంగ పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని, మన దేశ రాజ్యాంగం, దాని పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది, రాజ్యసభ ఎంపీ డా. మేనకా గురుస్వామి అన్నారు.
ఎస్. జైపాల్ రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో, మంథన్ ఫౌండేషన్ సహకారంతో శనివారం ఖైరతాబాద్ లోని విశ్వేశ్వరయ్య భవన్ లో ‘ఇండియన్ కాన్‌స్టిట్యూషన్ అండ్ ఇట్స్ ప్రొటెక్షన్’ అంశంపై ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో డా. మేనకా గురుస్వామి ప్రసంగించారు. నల్సార్ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ శ్రీకృష్ణ దేవరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
కార్యక్రమంలో తెలంగాణ విశ్వవిద్యాలయం నుంచి ఎల్.ఎల్.బీ విద్యార్థులు మొహమ్మద్ బుర్హానుద్దీన్, మొహమ్మద్ ఇర్ఫాన్, న్యాయవాదులు, విద్యార్థులు, విద్యావేత్తలు పాల్గొన్నారు.

إرسال تعليق