పోచారంలో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే పోచారం
SIR నోటీసులపై అధికారులతో ఆరా
బాన్సువాడ, ఆగస్టు 29: రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం ఉదయం తన స్వగ్రామం పోచారంలో లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లబ్ధిదారులతో మాట్లాడుతూ, కొత్త స్మార్ట్ కార్డుల వల్ల రేషన్ పంపిణీలో పారదర్శకత పెరుగుతుందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ పథకాలు అందాలని ఆకాంక్షించారు.
అనంతరం అక్కడే ఉన్న ఆర్డీవో రవీందర్ రెడ్డి, తహసీల్దార్ నరేందర్ గౌడ్, BLO లతో SIR (Special Intensive Revision) నోటీసుల జారీపై ఆరా తీశారు. ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ప్రతి ఇంటికి వెళ్లి నిష్పక్షపాతంగా విచారణ జరిపి అర్హులైన ఓటర్లందరినీ చేర్చాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మోహన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.


إرسال تعليق