తాడ్కోల్ రోడ్డు ప్రమాద బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే పోచారం
బాన్సువాడ, ఆగస్టు 29:
కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ రోడ్డు చౌరస్తా సిగ్నల్ వద్ద గురువారం స్కూల్ కు వెళ్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి జైనబ్ ఫాతిమా మృతి చెందిన ఘటన తీవ్ర విషాదం నింపింది. మరో ఇద్దరు పిల్లలకు గాయాలయ్యాయి.
బాధిత కుటుంబాన్ని శనివారం సాయంత్రం ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు పోచారం శ్రీనివాసరెడ్డి పరామర్శించారు. వాసవి కాలనీలోని బాలిక తండ్రి మహమ్మద్ రఫీ, తాత షాదుల్ మియా నివాసానికి వెళ్లి వారిని ఓదార్చారు. చిన్నారి మృతి చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.
బాధిత కుటుంబానికి ప్రభుత్వ పరంగా ఎక్స్ గ్రేషియా ఇప్పించి ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా తాడ్కోల్ చౌరస్తాను ఇరుకుగా చేసిన ఆక్రమణలను తొలగిస్తున్నామని, రోడ్డు వెడల్పు పనులు చేపడుతున్నామని తెలిపారు. పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.
ఆయన వెంట కాంగ్రెస్ నాయకులు మహమ్మద్ ఏజాజ్, హఫెజ్ వహాబ్, హకీం, ఇలియాజ్ తదితరులు ఉన్నారు.







إرسال تعليق