మిలాద్-ఉన్-నబీని శాంతియుతంగా జరుపుకోవాలి: డీఎస్పీ విఠల్ రెడ్డి
ముస్లిం మత పెద్దలతో పీస్ కమిటీ సమావేశం
బాన్సువాడ, ఆగస్టు 24: రాబోయే మిలాద్-ఉన్-నబీ పండుగను బాన్సువాడ పట్టణంలో ప్రశాంత వాతావరణంలో, మతసామరస్యంతో ఘనంగా నిర్వహించుకోవాలని బాన్సువాడ సబ్ డివిజన్ డీఎస్పీ విఠల్ రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం బాన్సువాడ పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో పట్టణ సీఐ, ముస్లిం మత పెద్దల ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.వీడియో 👇
ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ.. పండుగ సంబరాలు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా, అందరి సహకారంతో ప్రశాంతంగా ముగిసేలా చూడాలని కోరారు. ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా ఏర్పాట్లలో పోలీసు శాఖకు పూర్తి సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సమావేశంలో జామా మస్జిద్ అధ్యక్షులు రిజ్వాన్, ఎజాజ్, వహాబ్, నయీమ్, అల్తామశ్, కలీఖ్ ప్రెస్, అఫ్రోజ్, మతీన్ తదితరులతో పాటు వివిధ మస్జిద్‌లకు చెందిన సుమారు 30 మంది సదర్‌లు (మత పెద్దలు) పాల్గొన్నారు.




إرسال تعليق