యూనియన్ బ్యాంక్ 42వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు
లబ్ధిదారులకు బీమా చెక్కుల అందజేత
రుద్రంగి అశోక్/బాన్సువాడ, ఆగస్టు 24: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 42వ వ్యవస్థాపక దినోత్సవాన్ని బాన్సువాడ బ్రాంచిలో ఘనంగా నిర్వహించారు. బ్రాంచిని బెలూన్లతో అలంకరించి కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (PMJJBY), ప్రధాన మంత్రి సురక్ష బీమా యోజన (PMSBY) కింద మృతి చెందిన ఖాతాదారుల కుటుంబ సభ్యులకు రూ. 2 లక్షల చొప్పున బీమా క్లెయిమ్ చెక్కులను అందజేశారు.
లబ్ధిదారులు:
1. పుల్కంటి అనిత (భర్త సంజీవ్) - తాడ్కల్ - PMSBY - రూ.2,00,000/-
2. దండు సునీత (భర్త సైలు) - నాగారం - PMSBY - రూ.2,00,000/-
3. గూల గంగామణి (భర్త సైలు) - నాగారం - PMJJBY - రూ.2,00,000/-
ఈ కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ మధు, నాయకులు ఎర్వల కృష్ణారెడ్డి, అంజిరెడ్డి, బ్యాంక్ మేనేజర్, సిబ్బంది, ఖాతాదారులు, లబ్ధిదారుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.




إرسال تعليق