అటవీ సిబ్బందికి నేర పరిశోధనపై శిక్షణ
ఎఫ్ఐఆర్ నుంచి ఛార్జిషీట్ వరకు మెళకువలు
పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెల్లడి
నిజామాబాద్ క్రైం, న్యూస్‌టుడే: నేర పరిశోధన, కేసుల దర్యాప్తు, కోర్టు విచారణలో సమర్థవంతమైన ప్రాసిక్యూషన్‌పై అటవీశాఖ సిబ్బందికి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఒక్కరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ కమాండ్ కంట్రోల్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య ఐపీఎస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎఫ్ఐఆర్ నమోదు నుంచి ఛార్జిషీట్ దాఖలు వరకు ప్రతి దశలో తీసుకోవాల్సిన చర్యలు, శాస్త్రీయంగా సాక్ష్యాల సేకరణపై అటవీ అధికారులకు అవగాహన కల్పించామన్నారు. భారతీయ నాగరిక్ సురక్షా సంహిత (BNSS) 2023లోని సెక్షన్లు 176 నుంచి 193 వరకు దర్యాప్తు, సాక్షుల విచారణ, సమన్లు, వారెంట్ల అమలు నిబంధనలను వివరించారు.
నేర స్థలంలో లభించే భౌతిక, డిజిటల్ ఆధారాలు, సీసీటీవీ ఫుటేజీలను నిబంధనల ప్రకారం సేకరించడం, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపేటప్పుడు ప్యాకింగ్, లేబులింగ్, చైన్ ఆఫ్ కస్టడీ పాటించాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. కేసు నమోదు చేయడమే కాకుండా కోర్టులో నేరం రుజువై శిక్ష పడేలా దర్యాప్తు నాణ్యత పెంచుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఆర్బీ ఏసీపీ గురు నాయుడు, ఇన్‌స్పెక్టర్లు ఆర్.అంజయ్య, శ్రీధర్ రెడ్డి, మల్లేశం, ఎస్ఐ వరప్రసాద్ రెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ రవి మోహన్ బట్, డిప్యూటీ రేంజ్ ఆఫీసర్లు, సెక్షన్ ఆఫీసర్లు పాల్గొన్నారు.

إرسال تعليق