Top News

Sewing Machines | ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తులు ఆహ్వానం

కామారెడ్డి జిల్లా BC మహిళలకు ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం దరఖాస్తులు ఆహ్వానం  

సెప్టెంబర్ 13 వరకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్  

అర్హత, పత్రాల వివరాలను వెల్లడించిన కలెక్టర్

కామారెడ్డి, ఆగస్టు 19: కామారెడ్డి జిల్లాలోని BC మహిళలకు ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ ఆప్షన్స్ పథకం కింద దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఒక పత్రికా ప్రకటనలో తెలిపారు.

అర్హులైన BC మహిళలు https://tgobmms.cgg.gov.in/ వెబ్ సైట్ ద్వారా గానీ, మీ సేవా సెంటర్  గానీ, ఇతర ఆన్ లైన్ సెంటర్ లలో గానీ తేది 13-08-2026 నుండి 13-09-2026 వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుందని సూచించారు. లబ్ధిదారుల ఎంపికకు అర్హతలు వర్తిస్తాయి.

పథకం అర్హతలు ఇలా ఉన్నాయి:  

దరఖాస్తుదారు BC వర్గానికి చెందిన నిరుద్యోగ మహిళ అయి ఉండాలి. అత్యంత పేదలు, నిరాశ్రయులు, వితంతువులు, ఒంటరి మహిళలు, అనాథలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. తెల్ల రేషన్ కార్డు / ఫుడ్ సెక్యూరిటీ కార్డు తప్పనిసరిగా ఉండాలి. అవి లేని పక్షంలో ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాలి.

వార్షిక కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలకు, పట్టణ ప్రాంతాల్లో రూ.2.00 లక్షలకు మించరాదు. వయస్సు 18 నుండి 55 సంవత్సరాల మధ్య ఉండాలి. నివాస ధృవీకరణకు ఆధార్ కార్డు తప్పనిసరి. ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేయబడుతుంది.

కుట్టు పనిలో నైపుణ్యం కలిగిన అభ్యర్థులకు, MERA/MERU కమ్యూనిటీకి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. కనీస విద్యార్హత ప్రాథమిక అక్షరాస్యత ఉండటం ఉత్తమం. దరఖాస్తులు అధికంగా వచ్చిన పక్షంలో కనీసం 5వ తరగతి ఉత్తీర్ణులకు ప్రాధాన్యత ఇవ్వవచ్చు. ఇతర వివరాల కొరకు జిల్లా కేంద్రం లోని కలెక్టర్  కార్యాలయం రూమ్ నంబర్ 227, జిల్లా BC అభివృద్ధి అధికారి  కార్యాలయంలో సంప్రదించవచ్చు.

Post a Comment

أحدث أقدم