SGT ఉపాధ్యాయులపై మానసిక వేధింపులు ఆపాలి:
SGT సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ డిమాండ్
బాన్సువాడ, ఆగస్టు 30: ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న SGT ఉపాధ్యాయులపై మానసిక వేధింపులు ఆపాలని SGT ఉపాధ్యాయ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యాల సంతోష్ డిమాండ్ చేశారు.
బాన్సువాడ పట్టణంలో ఆదివారం SGT ఉపాధ్యాయులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన SA-1, SA-2 పరీక్షల బాహ్య మూల్యాంకన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని అన్నారు.
"1 లేదా 2 టీచర్లు ఉన్న ప్రైమరీ స్కూళ్లలో నాణ్యమైన విద్య ఎలా సాధ్యం? ఇప్పటికే బహుళ తరగతులు, బహుళ విషయాలు, FLN అమలు, బోధనేతర పనులతో టీచర్లు విసిగిపోతున్నారు. మళ్లీ ఒత్తిడికి గురిచేసే, అవమానించే నిర్ణయాలు తీసుకోవడం సరికాదు" అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించాలని, 5-6 పాఠశాలలకు కలిపి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ను ఇవ్వాలని, హైస్కూళ్లలో పనిచేస్తున్న SGT లను వెంటనే ప్రాథమిక పాఠశాలలకు బదిలీ చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో SGT నాయకులు శ్రీకాంత్, పండరి, ప్రవీణ్ కుమార్, నిఖిల్ కుమార్, శ్రీనివాస్, అనిల్, లక్క సంతోష్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق