సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలి: SGT యూనియన్
ఆర్డిఓ ఎడ్ల రవీందర్ రెడ్డికి వినతి పత్రం అందజేత
బాన్సువాడ: తెలంగాణ ప్రభుత్వం ఏర్పడగానే ఇచ్చిన హామీ మేరకు ఉపాధ్యాయ, ఉద్యోగులకు సిపిఎస్ ను రద్దు చేసి వెంటనే ఓపిఎస్ ను అమలు చేయాలని SGT యూనియన్ ఆధ్వర్యంలో డిమాండ్ చేశారు.ఈరోజు రెవెన్యూ డివిజనల్ అధికారి ఎడ్ల రవీందర్ రెడ్డికి SGT యూనియన్ ప్రతినిధులు వినతి పత్రాన్ని అందజేశారు.
ప్రధాన డిమాండ్లు
వినతి పత్రంలో SGT యూనియన్ నాయకులు పలు డిమాండ్లను ప్రస్తావించారు. పిఆర్సి గడువు ముగిసి రెండు సంవత్సరాలు అవుతున్నందున నూతన పిఆర్సి ని వెంటనే అమలు చేయాలని కోరారు. అలాగే పెండింగ్లో ఉన్న డిఎ ఏరియర్స్ తో పాటు ఉద్యోగులకు రావాల్సిన మిగిలిన బకాయిలన్నీ చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.
నూతనంగా రాబోతున్న ఎంఇఓ పోస్టులను సీనియర్ ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం లకు కేటాయించాలని కోరారు. అదేవిధంగా బి.ఎడ్ చేసిన ఉపాధ్యాయులకు కూడా ఎల్ఎఫ్ఎల్ హెచ్ఎం ల ప్రమోషన్లలో అవకాశం కల్పించాలని కోరారు.
సానుకూలంగా స్పందించిన ఆర్డిఓ
ఈ సందర్భంగా ఆర్డిఓ ఎడ్ల రవీందర్ రెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని సానుకూలంగా స్పందించారు.
ఈ కార్యక్రమంలో SGT యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి అయ్యల సంతోష్, శ్రీనివాస్ రెడ్డి, విట్టల్, శ్రీనివాస్ నాయక్, సంజయ్, రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق