బాన్సువాడ నియోజకవర్గం SIR 89.87% పూర్తి
డ్రాఫ్ట్ ఓటర్ల జాబితా విడుదల - 19,887 ఓట్లు డిలీట్
నియోజకవర్గ వ్యాప్తంగా 1.76 లక్షల ఓటర్లు
అక్టోబర్ 19న ఫైనల్ జాబితా
బాన్సువాడ :బాన్సువాడ నియోజకవర్గంలో ఓటర్ల ప్రత్యేక సవరణ కార్యక్రమం - SIR 89.87 శాతం పూర్తయినట్లు నియోజకవర్గ ఎన్నికల అధికారి, ఆర్డీఓ రవీందర్ రెడ్డి తెలిపారు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ఆయన అధ్యక్షతన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల ముసాయిదా జాబితాపై సమావేశం నిర్వహించారు.
SIR తర్వాత 1.76 లక్షలకు చేరిన ఓటర్లు
సమావేశంలో ఆర్డీఓ మాట్లాడుతూ నియోజకవర్గంలో మొత్తం 1,96,331 మంది ఓటర్లు ఉండగా, SIR ప్రక్రియలో 19,887 ఓట్లు డిలీట్ అయ్యాయని వెల్లడించారు.
డిలీట్ అయిన వాటిలో:
- 3,962 మంది చనిపోయారు
- 9,878 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారు
- 5,157 ఓట్లు డబుల్ ఎంట్రీలు ఉన్నాయి
- 863 మంది SIR చేయించుకోలేదు
- 43 మంది పేర్లు నమోదు చేయాల్సి ఉంది
SIR తర్వాత ప్రస్తుతం నియోజకవర్గంలో 1,76,449 మంది ఓటర్లు ఉన్నారని ఆయన తెలిపారు. నియోజకవర్గం వ్యాప్తంగా 235 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు.
డ్రాఫ్ట్ జాబితా అతికించారు - అభ్యంతరాలు స్వీకరణ
ఈ రోజు ఓటర్ల ముసాయిదా జాబితాను ప్రకటించినట్లు, నియోజకవర్గంలోని అన్ని మండల కేంద్రాల్లో డ్రాఫ్ట్ జాబితాను అతికిస్తున్నామని ఆర్డీఓ చెప్పారు. ఓటర్ల పేర్లు, వివరాల్లో ఏవైనా తప్పులు, అభ్యంతరాలు ఉంటే సంబంధిత BLO లేదా తహసీల్దార్ కార్యాలయానికి తెలియజేయాలని కోరారు.
నేటి నుంచి కొత్త నమోదు - ఫామ్ 6, 7, 8 స్వీకరణ
నేటి నుంచి కొత్త ఓటర్ల నమోదు, అడ్రస్ మార్పులు, పేరు మార్పులు, ఇతర దిద్దుబాట్ల కోసం ఫామ్ 6, 7, 8 స్వీకరిస్తున్నామని తెలిపారు. 18 ఏళ్లు నిండిన కొత్త ఓటర్లు తప్పనిసరిగా డిక్లరేషన్ ఫారంతో పాటు దరఖాస్తు చేయాలని సూచించారు.
SIR తుది షెడ్యూల్ వివరాలు:
BLO ల ఇంటింటి సందర్శన : 25.06.2026 నుండి 10.08.2026 వరకు
పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ : 10.08.2026
ఓటర్ల ముసాయిదా జాబితా ప్రచురణ : 17.08.2026
క్లెయిమ్స్ & అభ్యంతరాల దరఖాస్తుల కాలం : 17.08.2026 నుండి 16.09.2026 వరకు
క్లెయిమ్స్ & అభ్యంతరాల విచారణ / పరిష్కారం : 17.08.2026 నుండి 15.10.2026 వరకు
ఓటర్ల తుది జాబితా ప్రచురణ : 19.10.2026
SIR ప్రక్రియ పూర్తిగా విజయవంతం కావడానికి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు సహకరించారని ఆర్డీఓ తెలిపారు.
సమావేశంలో పాల్గొన్న వారు
ఈ సమావేశంలో తహసీల్దార్ రాజ నరేందర్ గౌడ్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యుడు, కాంగ్రెస్ యువ నేత కాసుల రోహిత్, మాసాని రవీందర్ రెడ్డి,బీజేపీ అధ్యక్షుడు కొనాల గంగారెడ్డి, బీఆర్ఎస్ నేత రమేష్ యాదవ్, టీడీపీ నేత శంషాద్దిన్, ఎంఐఎం నేత హశిం, ఆర్ఐ సంగమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
Note : for youtube link see in description





إرسال تعليق