Top News

Teacher's Unique Protest | ఎల్బీ స్టేడియంలో వినూత్న నిరసన తెలిపిన కామారెడ్డి ఎస్జీటీ టీచర్


జీవితాంతం చదువు చెప్పిన చేతులతో.. పల్లీల బుట్ట మోస్తున్నా!’

ఎల్బీ స్టేడియంలో వినూత్న నిరసన తెలిపిన కామారెడ్డి ఎస్జీటీ ఉపాధ్యాయుడు దామోదరరావు

కామారెడ్డి : సీపీఎస్ విధానం వల్ల భవిష్యత్తులో ఉపాధ్యాయుల పరిస్థితి ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్లు చూపిస్తూ కామారెడ్డి జిల్లా ఉపాధ్యాయుడు చేసిన వినూత్న నిరసన ఎల్బీ స్టేడియంలో అందరి దృష్టిని ఆకర్షించింది.

కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (సీపీఎస్) రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపీఎస్) అమలు చేయాలని కోరుతూ ఆదివారం ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన జనజాగరణ సభలో లింగంపేట మండలం ఐలాపూర్ కు చెందిన ఎస్జీటీ ఉపాధ్యాయుడు బి. దామోదరరావు వినూత్న వేషధారణతో నిరసన తెలిపారు.

ఆయన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కాదు. ప్రస్తుతం సర్వీసులో ఉన్న ఉపాధ్యాయుడే. అయితే సీపీఎస్ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఎదురయ్యే దయనీయ పరిస్థితిని ప్రతిబింబించేందుకు రిటైర్డ్ ఉద్యోగి వేషంలో వచ్చారు.

నెత్తిన రుమాలు, చేతిలో పల్లీల బుట్ట, పేపర్లతో తిరుగుతూ.. మెడలో ప్లకార్డు ధరించారు.

 రూ.91 వేల జీతం తీసుకునే ఉద్యోగికి రిటైర్మెంట్ తర్వాత కేవలం రూ.4,200 పెన్షన్ వస్తే ఎలా బతకాలని ఆయన సింబాలిక్ గా చూపించారు.

"ఇప్పటికైనా ఓపీఎస్ కోసం పోరాడకపోతే రేపు మనందరి పరిస్థితి రోడ్డున పల్లీలు అమ్ముకునే దుస్థితికి దిగజారుతుంది" అంటూ తోటి ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు.

అధికారంలోకి వస్తే సీపీఎస్ రద్దు చేస్తామన్న హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన డిమాండ్ చేశారు.

వీడియో 👇



Post a Comment

أحدث أقدم