కామారెడ్డిలో అంగరంగ వైభవంగా న్యూ బ్రీజా కార్ ప్రారంభోత్సవం
మొదటి కస్టమర్‌గా భుక్యా సుస్మిత
కామారెడ్డి: కామారెడ్డి జిల్లా కేంద్రంలోని వరుణ్ మోటార్స్ ఆధ్వర్యంలో నూతన మారుతి సుజుకి బ్రీజా కార్ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రవాణా శాఖ అధికారి టి. సంతోష్ కుమార్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్‌స్పెక్టర్ శంకర్ నారాయణ, ఎస్‌బీఐ చీఫ్ మేనేజర్ క్రెడిట్ ప్రవీణ్ కుమార్ హాజరై నూతన బ్రీజా కారును ఆవిష్కరించారు.
కామారెడ్డి ప్రాంతానికి చెందిన భుక్యా సుస్మిత ఈ నూతన బ్రీజా కారును కొనుగోలు చేసిన మొదటి కస్టమర్‌గా నిలిచారు. వరుణ్ మోటార్స్ తరపున ఆమెకు ఘనంగా స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు.
ఈ సందర్భంగా బ్రాంచ్ మేనేజర్ రాకేష్ రావు మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా బ్రీజాకు 14 లక్షలకు పైగా నమ్మకమైన కస్టమర్లు ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం న్యూ బ్రీజాలో టర్బో జెట్ ఇంజన్, అండర్ బాడీ, సీఎన్జీ వంటి అధునాతన ఫీచర్లు అందుబాటులోకి వచ్చాయని, వాహన కొనుగోలుదారులు దీనిపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వరుణ్ మోటార్స్ టీం ప్రతినిధులు టి. భాస్కర్, వై. దేవానంద్, జి. రాజు తదితరులు పాల్గొన్నారు.

إرسال تعليق