కాంగ్రెస్ 1000 రోజుల పాలనలో దగా, మోసమే
బీఆర్ఎస్ హయాంలోనే రైతులకు న్యాయం:మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్
నస్రుల్లాబాద్ లో బీఆర్ఎస్ నిరసన
నస్రుల్లాబాద్, సెప్టెంబర్ 06: కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలన ప్రజలకు దగా, మోసంతో కూడిన పాలన అని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ విమర్శించారు.
నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో ఆదివారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో "కాంగ్రెస్ 1000 రోజుల దగా - బీఆర్ఎస్ పోరుబాట" కార్యక్రమం నిర్వహించారు. ముందుగా మండల కేంద్రంలో బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ర్యాలీ శ్రీరామాలయం నుంచి బస్టాండ్ వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం నర్సరీ, పల్లె ప్రకృతి వనం, గ్రామ పంచాయతీ భవనం, మురుగు కాల్వలను పరిశీలించారు.
అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని ఆరోపించారు. రైతు భరోసా, రుణమాఫీ, యువతకు ఉద్యోగాలు, మహిళలకు రూ. 2500 లాంటి హామీలన్నీ గాలికొదిలేశారని అన్నారు.
ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డిని బీఆర్ఎస్ లోకి తీసుకోరని మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ కీలక వ్యాఖ్యలు చేశారు... గత ప్రభుత్వంలో మంత్రిగా, సభాపతిగా పని చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి నస్రుల్లాబాద్ మండల కేంద్రంలో శిథిలావస్థలో చేరి, కూలిపోతున్న గ్రామ పంచాయతీ భవనాన్ని ఎందుకు నిర్మించలేదని ప్రశ్నించారు.
కేసీఆర్ అమలు చేసిన పథకాలను సీఎం రేవంత్ రెడ్డి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కేసీఆర్ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, కాళేశ్వరం నీళ్లతో సాగు అభివృద్ధి చెందిందని, కాంగ్రెస్ వచ్చాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. అనంతరం పంట పొలాలను సందర్శించి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మోరీల్ శ్రీనివాస్ రావు, గణేష్, కార్యకర్తలు, రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
-----------------
కాంగ్రెస్, బీజేపీల నుండి బీఆర్ఎస్ లోకి చేరికలు
రుద్రూర్ లో కొత్తపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో పార్టీలోకి ఆహ్వానం
రుద్రూర్, సెప్టెంబర్ 06: రుద్రూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీలో చేరికలు కొనసాగుతున్నాయి. ఆదివారం బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ ఆధ్వర్యంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు బీఆర్ఎస్ లో చేరారు.
బీజేపీ పార్టీ నుండి రుద్రూర్ మండలం బొప్పాపూర్ గ్రామ అధ్యక్షులు నారోజి శ్రీనివాస్, కాంగ్రెస్ పార్టీ నుండి తగ్గేల్లి కిరణ్, బొమ్మిడి పాపయ్యలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్తపల్లి రవికిరణ్ వారికి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు పలు అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అందించారని, కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసే బీఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారని అన్నారు.
ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సిరిగాది శేఖర్, నితిన్ పటేల్, నరేందర్, సాయిలు, యువజన నాయకులు జువ్వల శ్రావణ్, టింకు గౌడ్, సుమన్, గుండ్ల మధు, పట్ల శ్రీకాంత్, పట్ల సంతోష్ పటేల్, సయ్యద్ కిజర్, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.






إرسال تعليق