మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసుల దాడికి నిరసన
నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద జర్నలిస్టుల ఆందోళన
దోషులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్
నిజామాబాద్, సెప్టెంబర్ 06: మహిళా జర్నలిస్ట్ పై ఢిల్లీ పోలీసులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదివారం నిజామాబాద్ ధర్నా చౌక్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఉర్దూ, తెలుగు ప్రింట్, ఎలక్ట్రానిక్, సోషల్ మీడియా జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని సంఘీభావం తెలిపారు. Video 👇
ఈ సందర్భంగా కాంగ్రెస్, బీఆర్ఎస్, ఎంఐఎం పార్టీల జిల్లా ఇంచార్జ్ లు, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, బీఆర్ఎస్ అర్బన్ ఇంచార్జ్ గణేష్ గుప్తా, రామకృష్ణ, జావిద్ అక్రమ్, కుద్దూస్ భాయ్, నిజామాబాద్ ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు ఫయాజ్ తో పాటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సంఘాల నాయకులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఢిల్లీలో మహిళా జర్నలిస్టులపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. సమాజంలో ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్టులపై పోలీసులు దాడి చేయడం హేయమైన చర్య అని అన్నారు. దాడికి పాల్పడిన ఢిల్లీ పోలీసులపై శాఖపరమైన చర్యలు తీసుకునే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. కులమత భేదాలు సృష్టించి దాడి చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఢిల్లీ పోలీసులు జర్నలిస్టులకు క్షమాపణ చెప్పే వరకు నిరసన ఉద్యమాన్ని కొనసాగిస్తామని తెలిపారు.
మహిళా జర్నలిస్టుపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం...
అణిచివేత చర్యలు ప్రజాస్వా మ్య స్ఫూర్తికి విరుద్ధము....... పి ఆర్ టి యు తెలంగాణ జిల్లా గౌరవాధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి
నేడు ధర్మా చౌక్ వద్ద పాత్రికేయుల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పి ఆర్ టి యు తెలంగాణా జిల్లా గౌరవ అధ్యక్షులు కృపాల్ సింగ్ సోడి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, తక్షణమే దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేస్తూ మహిళా జర్నలిస్టులకు న్యాయం చేయాలని, భావ ప్రకటన స్వేచ్ఛను గౌరవించేది పోయి అణిచివేత చర్యలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధమని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, ధర్నా చౌక్ వద్ద నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమంలో పాల్గొని సంఘీ భావంతెలియజేయడం జరిగింది. తదితరులు పాల్గొన్నారు
ఈ నిరసన కార్యక్రమంలో అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు మాజీద్, నర్సింలు, జర్నలిస్టు సుభాష్, కైసర్,అఖిల్, ఖాలేద్, పాషా ఖాన్, షకీల్,యూనస్, యాసీన్, ఉస్మాన్, నదీమ్, గఫార్, యూసుఫ్ తదితర జర్నలిస్టులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.




إرسال تعليق