Top News

Call 112-Save Life | ఒక్క 112 కాల్ తో తప్పిన పెను విషాదం

ఒక్క 112 కాల్ తో తప్పిన పెను విషాదం

బిడ్డతో వెళ్లిన మహిళను కాపాడిన దోమకొండ పోలీసులు

సమయస్ఫూర్తితో వ్యవహరించిన సిబ్బందిని అభినందించిన ఎస్పీ

కామారెడ్డి, సెప్టెంబర్ 07:

కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురై బిడ్డతో ఇంటి నుంచి వెళ్లిపోయిన మహిళను దోమకొండ పోలీసులు సకాలంలో గుర్తించి కాపాడి పెను విషాదాన్ని తప్పించారు.

దోమకొండ గ్రామ పంచాయతీ సమీపంలో భార్యాభర్తల మధ్య గొడవ అనంతరం ఓ మహిళ తన చిన్నారిని తీసుకుని వెళ్లిపోయిందని, ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులు డయల్-112 కు సమాచారం అందించారు.

సమాచారం అందుకున్న వెంటనే స్పందించిన పెట్రో కార్ సిబ్బంది కానిస్టేబుల్ సాయిబాబా, హోంగార్డ్ రాజు గాలింపు చేపట్టి గుండ్ల చెరువు కట్ట సమీపంలోని దారిలో మహిళను బిడ్డతో కలిసి గుర్తించారు. ఆమెతో మాట్లాడి సముదాయించి కౌన్సెలింగ్ ఇచ్చి సురక్షితంగా భర్త, అత్తకు అప్పగించారు.

తక్షణ స్పందనతో తల్లీబిడ్డ ప్రాణాలను కాపాడిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర అభినందించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ "ఆత్మహత్య ఏ సమస్యకూ పరిష్కారం కాదు. ఎంతటి క్లిష్ట పరిస్థితి ఎదురైనా ధైర్యంగా ఉండాలి. ఆపదలో ఉన్నవారు వెంటనే డయల్-112 కు సమాచారం అందించాలి. ప్రజల ప్రాణ రక్షణకు పోలీసులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారు" అని తెలిపారు.

#ఒక్క ఫోన్ కాల్.. రెండు ప్రాణాలకు రక్షణ - ఆపదలో డయల్-112 కు కాల్ చేయండి#

Post a Comment

أحدث أقدم