ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలి - అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి
సెప్టెంబర్ 4లోగా 3,408 ఇళ్ల ప్రతిపాదనలు పంపాలి - అధికారులకు ఆదేశం
కామారెడ్డి, సెప్టెంబర్ 02:
కామారెడ్డి జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతిపై అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి కలెక్టరేట్ లో మండల స్థాయి ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మండల స్థాయి అధికారులు తమకు కేటాయించిన 3,408 ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన ప్రతిపాదనలను సెప్టెంబర్ 4వ తేదీలోగా సమర్పించాలని ఆదేశించారు.
రెండో విడతలో మంజూరైన 1,704 గృహాలకు వెంటనే మార్కౌట్ ఇచ్చి లబ్ధిదారులు నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మొదటి దశలో మంజూరైన ఇళ్లలో పెండింగ్ లో ఉన్న నిర్మాణాలను ప్రత్యేకంగా పర్యవేక్షించి త్వరగా పూర్తి చేయాలన్నారు.
ప్రతి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, లబ్ధిదారుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో సాధించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో ప్రాజెక్ట్ డైరెక్టర్ (గృహములు), ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.
---
బ్యాంకులు నిర్దేశించిన రుణ లక్ష్యాలను సాధించాలి - అదనపు కలెక్టర్ ఎన్.వై.గిరి
అర్హులైన రైతులకు సకాలంలో రుణాలు మంజూరు చేయాలి
కామారెడ్డి, సెప్టెంబర్ 02:
కామారెడ్డి కలెక్టరేట్ లో జూన్ 2026తో ముగిసిన త్రైమాసికానికి సంబంధించిన జిల్లా సంప్రదింపుల కమిటీ (DCC), జిల్లా స్థాయి సమీక్షా కమిటీ (DLRC) సమావేశం అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి అధ్యక్షతన నిర్వహించారు.
వార్షిక రుణ ప్రణాళిక పురోగతిని సమీక్షించిన అదనపు కలెక్టర్, వ్యవసాయ రంగానికి మరింతగా రుణాలు అందించాలని, పంట రుణాలను సకాలంలో రెన్యువల్ చేయడంతో పాటు అర్హులైన రైతులకు కొత్త రుణాలు మంజూరు చేయాలని బ్యాంకర్లను ఆదేశించారు.
ఎస్సీ యాక్షన్ ప్లాన్, పీఎంఈజీపీ, పీఎంఎఫ్ఎంఈ, పీఎం విశ్వకర్మ పథకాల కింద పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను త్వరగా పరిష్కరించి రుణాలు మంజూరు చేయాలన్నారు. స్వయం సహాయక సంఘాల బ్యాంకు అనుసంధానాన్ని పెంచాలని, రికవరీపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
బ్యాంకింగ్ సేవలు లేని రెవెన్యూ కేంద్రాలను గుర్తించి కొత్త బ్రాంచ్ లు లేదా బీసీ పాయింట్లు ఏర్పాటు చేయాలని, ఖాతాదారుల రీ-కేవైసీ కోసం ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని తెలిపారు.
గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు RSETI శాశ్వత భవనానికి కనీసం ఒక ఎకరం స్థలం కేటాయించే అంశంపై సమావేశంలో చర్చించారు.
సమావేశంలో నాబార్డ్ డీడీఎం, ఆర్బీఐ ప్రతినిధి, వివిధ బ్యాంకుల కంట్రోలర్లు, ప్రభుత్వ శాఖల అధికారులు పాల్గొన్నారు.
-------
ఎస్ఐఆర్-2026పై రాజకీయ పార్టీలతో సమీక్ష - అదనపు కలెక్టర్ విక్టర్
ఓటర్ల జాబితా సవరణ పారదర్శకంగా నిర్వహిస్తున్నాం - సెప్టెంబర్ 5,6,12,13 తేదీల్లో ప్రత్యేక ప్రచారం
కామారెడ్డి, సెప్టెంబర్ 02:
కామారెడ్డి జిల్లాలో కొనసాగుతున్న ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (SIR)-2026 ప్రక్రియను నిబంధనల ప్రకారం సమర్థవంతంగా నిర్వహిస్తున్నామని అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్ తెలిపారు.
బుధవారం జిల్లా సమీకృత కలెక్టరేట్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఎస్ఐఆర్-2026 పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఓటర్లకు నోటీసుల జనరేషన్, నోటీసుల జారీ, విచారణల పురోగతిని రాజకీయ పార్టీల ప్రతినిధులకు వివరించారు. అర్హత కలిగిన ప్రతి ఓటరు పేరు తుది జాబితాలో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని, అదే సమయంలో అర్హత లేని, మరణించిన లేదా డూప్లికేట్ ఓటర్ల పేర్లను నిబంధనల ప్రకారం పరిశీలించి తొలగిస్తున్నామని తెలిపారు.
క్లెయిమ్‌లు, అభ్యంతరాలను పారదర్శకంగా పరిశీలించి ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు నిర్ణయాలు తీసుకుంటామని పేర్కొన్నారు.
ఓటర్ల నమోదు, తొలగింపు, సవరణకు సంబంధించిన ఫారం-6, ఫారం-7, ఫారం-8 దరఖాస్తులపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. సెప్టెంబర్ 5, 6 మరియు 12, 13 తేదీల్లో జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఈ ప్రత్యేక క్యాంపెయిన్ నిర్వహించనున్నట్లు వెల్లడించారు.
కొత్తగా అర్హత పొందిన వారు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని, తొలగింపునకు ఫారం-7, వివరాల సవరణకు ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ పేర్లను ఓటరు జాబితాలో సరి చూసుకోవాలని కోరారు.
సమావేశంలో అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) ఎన్.వై. గిరి, ప్రొ. డిప్యూటీ కలెక్టర్ రవితేజ, ఎన్నికల సూపరింటెండెంట్ రాజేశ్వర్, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.



إرسال تعليق