Top News

MLA PSR Angry | ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ

కామశెట్పల్లిలో జరిగిన సభలో పోచారం 
డబుల్ బెడ్ రూం ఇండ్లను అమ్ముతూ, అద్దెకు ఇస్తున్న వారిపై ఎమ్మెల్యే పోచారం ఆగ్రహం

-ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ 

బాన్సువాడ, సెప్టెంబర్ 03:

పేదలకు ఇచ్చిన డబుల్ బెడ్ రూం ఇండ్లను కొందరు లబ్ధిదారులు అమ్ముకోవడం, అద్దెకు ఇవ్వడంపై ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

గురువారం సాయంత్రం ఎమ్మెల్యే పోచారం బాన్సువాడ పట్టణంలోని తాడ్కోల్ శివారులో ఉన్న డబుల్ బెడ్ రూం ఇండ్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కొందరు లబ్ధిదారులు తమ ఇండ్లను బయటి వ్యక్తులకు అద్దెకు ఇవ్వడం, మరికొందరు అమ్మే ప్రయత్నాలు చేయడం, ఇంకొందరు తాళాలు వేసి ఇతర ప్రాంతాల్లో ఉంటున్నట్లు తెలియడంతో లబ్ధిదారులను పిలిచి మందలించారు.

నిరుపేదలు, ఇల్లు లేని వారి కోసం ప్రభుత్వం ఎంతో కష్టపడి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మించి ఇస్తే, వాటిని విక్రయించుకోవడం, అద్దెకు ఇవ్వడం, తాళాలు వేసి ఉంచడం సరికాదని, ఇలాంటి చర్యల వల్ల నిజమైన నిరుపేదలకు అన్యాయం జరుగుతుందని అన్నారు.

వెంటనే అద్దెకు ఉంటున్న వారు ఇండ్లను ఖాళీ చేయాలని, లబ్ధిదారులే స్వయంగా నివాసం ఉండాలని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంపై పూర్తిగా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఆయన వెంట స్థానిక నాయకులు, కార్యకర్తలు, అధికారులు ఉన్నారు.

అర్హులైన ప్రతి కుటుంబానికి సంక్షేమ ఫలాలు అందాలి - ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

కాంశేట్ పల్లి (నసురుల్లాబాద్), సెప్టెంబర్ 03:

నసురుల్లాబాద్ మండలం కాంశేట్ పల్లి గ్రామంలో  స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరై లబ్ధిదారులకు తన చేతుల మీదుగా స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా రేషన్ పంపిణీలో మరింత పారదర్శకత, సమర్థత పెరుగుతుందని తెలిపారు. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రజల సంక్షేమమే ప్రభుత్వాల ప్రధాన లక్ష్యమని, అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.

కార్యక్రమంలో నసురుల్లాబాద్ మండల ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు, లబ్ధిదారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.


Post a Comment

أحدث أقدم