Top News

SRNK COLLEGE | చక్కటి చదువుతోనే భవిష్యత్తుకు మార్గం - ఎమ్మెల్యే పోచారం

బాన్సువాడ SRNK డిగ్రీ కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్ డే వేడుకలు

విద్యార్థుల్లో పోటీ తత్వం అవసరం, చక్కటి చదువుతోనే భవిష్యత్తుకు మార్గం - ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి

ఎమ్మెల్యే పోచారం న్యూ లుక్....!

బాన్సువాడ, సెప్టెంబర్ 03:

బాన్సువాడలోని SRNK ప్రభుత్వ డిగ్రీ & పీజీ కళాశాలలో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.

కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే జ్యోతి ప్రజ్వలన చేసి సరస్వతీ దేవి చిత్రపటానికి పూలమాల వేసి వేడుకలను ప్రారంభించారు. అనంతరం విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. లంబాడీ విద్యార్థినుల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. SRNK డిగ్రీ కళాశాలకు ఉమ్మడి జిల్లాతో పాటు రాష్ట్రంలోనే మంచి గుర్తింపు ఉందన్నారు. ఇక్కడ చదివిన ఎంతో మంది విద్యార్థులు ఉన్నత ఉద్యోగాలు సాధించి మంచి స్థానాల్లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం చేరిన విద్యార్థులు రెగ్యులర్ గా కళాశాలకు వచ్చి, కష్టపడి చదివి మంచి మార్కులు సాధించి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు.

విద్యారంగంలో, ఉద్యోగ రంగంలో ఉన్న పోటీని తట్టుకోవాలంటే విద్యార్థుల్లో పోటీ తత్వం అవసరమని, కష్టపడి చదవాల్సిందేనని అన్నారు. బాన్సువాడ నియోజకవర్గంలో తాను విద్యారంగానికి ఎంతో ప్రాధాన్యత ఇచ్చి, కళాశాలల్లో వివిధ భవనాలు, సౌకర్యాలు కల్పించానని, దీని వల్ల విద్యార్థులకు ఉన్నత విద్యతో పాటు ఉపాధి అవకాశాలు మెరుగయ్యాయని అన్నారు. అనంతరం ఎమ్మెల్యే విద్యార్థులతో కలిసి సరదాగా గడిపారు.

కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ గంగాధర్, నాయకులు నాగుల గామ వెంకన్న, శివదయాల్ వర్మ, శ్రీనివాస్ రెడ్డి, అధ్యాపక బృందం, విద్యార్థినీ విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ఎమ్మెల్యే పోచారం న్యూ లుక్....

ఎప్పుడూ ధోతీ కుర్తాలో కనిపించే ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ వేడుకలకు సరికొత్త లుక్ లో రావడం అందరినీ ఆకట్టుకుంది. లైట్ బ్లూ షర్ట్, డార్క్ బ్లూ ప్యాంట్, వైట్ క్యాప్, కూలింగ్ గ్లాసెస్ తో  కొత్త లుక్ లో కనిపించి అందరినీ ఆకర్షించారు.


బాన్సువాడ SRNK కళాశాల ఫ్రెషర్స్ డే వేడుకలకు కొత్త లుక్ లో విచ్చేసిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి - షర్ట్, ప్యాంట్, క్యాప్, కూలింగ్ గ్లాస్ తో.... 👆







Post a Comment

أحدث أقدم