41వ కంటి దాన పక్షోత్సవాల్లో భాగంగా బాన్సువాడలో అవగాహన ర్యాలీ
బాన్సువాడ, సెప్టెంబర్ 4 : 41వ కంటి దాన వారోత్సవాలను పురస్కరించుకుని ప్రభుత్వ నర్సింగ్ కళాశాల (GCON), బాన్సువాడ ఆధ్వర్యంలో భారీ అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ (DM&HO), కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రి, బాన్సువాడ సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది.
ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ఎం. శ్రీనివాస్ పోలీస్ శాఖ అనుమతితో ఉదయం 9:30 గంటలకు MCH సెంటర్, బాన్సువాడ నుండి ప్రారంభమైన ర్యాలీ బస్ స్టేషన్ వరకు కొనసాగింది.
ఈ ర్యాలీలో RMO-1 డా. సుజాత, RMO-2 డా. ప్రకాష్, GCON ప్రిన్సిపాల్ శ్రీమతి అన్నీ ప్రణూతి, అధ్యాపకులు, GCON, MCH విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థులు కంటి దానంపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ, నినాదాలు చేస్తూ ప్రజల్లో చైతన్యం కలిగించారు.
ర్యాలీ అనంతరం విద్యా కార్యక్రమం:
4వ సెమిస్టర్ B.Sc నర్సింగ్ విద్యార్థులు కంటి నిర్మాణం, సాధారణ కంటి వ్యాధులు, నివారించదగిన అంధత్వం, కంటి సంరక్షణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆరోగ్యకరమైన ఆహారం, కంటి దానం యొక్క ప్రాముఖ్యత, అర్హత, ప్రక్రియ, కార్నియల్ అంధత్వం ఉన్నవారికి కంటి దానం ద్వారా కలిగే ప్రయోజనాలపై వివరించారు.
లయన్స్ క్లబ్ సహకారం:
లయన్స్ క్లబ్ సభ్యుల సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డా. గణేష్ కులకర్ణి, ప్రోగ్రాం మేనేజర్ హన్మంతులు పాల్గొని కంటి దానం ఆవశ్యకతను వివరించారు.
విద్యార్థులు, అధ్యాపకులు, వైద్యాధికారులు ప్రజల చురుకైన భాగస్వామ్యంతో కార్యక్రమం విజయవంతంగా ముగిసిందని నిర్వాహకులు తెలిపారు.


إرسال تعليق