బాన్సువాడలో శ్రీ సంత్ సేన మహారాజ్ పుణ్యతిథి వేడుకలు
హాజరైన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి
బాన్సువాడ, సెప్టెంబర్ 08: బాన్సువాడ పట్టణంలో నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం శ్రీ శ్రీ శ్రీ సంత్ సేన మహారాజ్ పుణ్యతిథి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు, బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సంత్ సేన మహారాజ్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆయన చూపిన ఆధ్యాత్మిక, సామాజిక సేవా మార్గాలను స్మరించుకున్నారు.
అనంతరం పోచారం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శ్రీ సంత్ సేన మహారాజ్ జీవితం భక్తి, నిష్ఠ, సేవకు ప్రతీక అని కొనియాడారు. నిజమైన భక్తితో భగవంతుడిని ఆశ్రయిస్తే ఆ భక్తుడిని కాపాడేందుకు భగవంతుడు స్వయంగా వచ్చి నిలుస్తాడు అనే గొప్ప సందేశాన్ని ఆయన జీవితం మనకు అందిస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో భక్తులు, నాయి బ్రాహ్మణ సంఘ నాయకులు, ప్రజాప్రతినిధులు, స్థానికులు అధిక సంఖ్యలో పాల్గొని సంత్ సేన మహారాజ్ కు భక్తిశ్రద్ధలతో ఘన నివాళులు అర్పించారు.




إرسال تعليق