Top News

Unity is Our Strength | హనుమాన్ ఆలయ నిర్వాహకులతో మదర్సా నిర్వాహకుల సద్భావన భేటీ

బాన్సువాడలో జాతీయ సమైక్యతా సదస్సు ఆహ్వానం

హనుమాన్ ఆలయ నిర్వాహకులతో మదర్సా నిర్వాహకుల సద్భావన భేటీ

బాన్సువాడ, సెప్టెంబర్ 08:

బాన్సువాడలోని మదర్సా అబ్దుల్లా బిన్ అబ్బాస్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ 16న మార్కెట్ యార్డ్ గంజ్ లో జాతీయ సమైక్యతా సదస్సు నిర్వహించనున్న విషయం తెలిసిందే.

ఈ సదస్సుకు ఆహ్వానం, సద్భావనలో భాగంగా పట్టణంలోని ప్రాచీన పెద్ద హనుమాన్ ఆలయ నిర్వాహకులు, పెద్దలతో మదర్సా నిర్వాహకులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పరస్పర ప్రేమ, సోదరభావం, జాతీయ సమైక్యత పెంపుపై చర్చించారు. జాతీయ సమైక్యతా సదస్సుకు హాజరు కావాలని హృదయపూర్వకంగా ఆహ్వానించారు.

వివిధ మతాలు, వర్గాల మధ్య ప్రేమ, పరస్పర గౌరవం, ఐక్యతను పెంపొందించడం, మనమంతా భారతీయులమని, దేశ అభివృద్ధి, శాంతి, భద్రత, సుభిక్షం కోసం కలిసికట్టుగా ముందుకు సాగడం మనందరి ఉమ్మడి బాధ్యత అనే సందేశాన్ని చాటడమే ఈ కలయిక ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.




ఈ సదస్సు దేశంలో శాంతి, సోదరభావం, జాతీయ సమైక్యతకు దోహదపడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో  ఆలయ పూజారి, 
పెద్ద హనుమాన్ మందిర్ కమిటీ సభ్యులు రుద్రంగి అశోక్, పాత బాలకృష్ణ, తృప్తి నాగరాజు, నార్ల రవీందర్, సిర్న దత్తన్న, నార్ల ఉదయ్, సాయి బాబా, మదర్సా నిర్వాహకులు ముఫ్తి ఉమర్ బిన్ ఈసా, అబ్దుల్ వహాబ్, అఫ్రోజ్, అజీమ్ తదితరులు పాల్గొన్నారు.


Post a Comment

أحدث أقدم